Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కన నదులున్న పల్లెలకు మంచినీటి కరువు
- పట్టించుకొని పాలకులు
గంగను నెత్తిన పెట్టుకొని నీటి కోసం అల్లాడుతున్నట్లుగా మారింది కృష్ణ మండల పల్లెల వాసులకు, తాగుదామంటే గుక్కెడు మంచినీరు ఉండదు ఎవరిని కలిసిన చేద్దామంటూ చేతులు దులుపుకుంటున్నారు, పక్కన నదులున్న పట్టణాల నుండి మంచినీరు సరఫరా అందని ద్రాక్షలాగా మంచినీరు పథకం.
నవతెలంగాణ -కృష్ణ
కృష్ణ మండలంలోని తంగడిగి, ఐనాపూర్, కుసుమూర్తి, హిందూపూర్, కున్సి, ముడుమాల్, గురజాల గ్రామాల ప్రజలు నీటి కటకటను కొన్ని సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్నారు, మంచినీటి సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు. కృష్ణ మండలంలో కృష్ణానది, భీమా నది రెండు సంవత్సరము పొడవునా పారిన అవీ చూడడానికి వినడానికి మాత్రమే పనికొస్తున్నాయి. పక్కనే ఉన్న నది నీరును తీసుకొచ్చి ప్రజలకు అందించే ఆలోచనగాని, ప్రయత్నాలుగానీ పాలకులు, అధికారులు చేయలేదని తెలి పారు. మండల ప్రజల తాగునీటి కష్టాలు ఇప్పటి వరకూ తీరలేదని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రతి గ్రామానికి ఇంటింటా నల్ల ద్వారా మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ పథకం తెచ్చిన ఇప్పటిదాకా చుక్క నీరు అందక తాగునీటి కొరకు నానాతంటలు పడుతూ బోరో, బావో నీరు గతే దిక్కని చేప్పారు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు, అదికారులకు వినతిపత్రాలు అందించినా ప్రజయోజనం లేదని వాపోయారు. ఇక్కడ ప్రాంతానికి నీటి ప్రెజర్ రాక వాటర్ ట్యాంకులకు ఎక్కవని, పైప్ లైన్లు పగిలిపో తున్నావని సాకులు చెప్తున్నారని ఆరోపించారు.నదీ పక్కన ఉన్న గ్రామంలో పెద్ద ట్యాంక్‌ని నిర్మించి అక్కడి నుంచి నీరును శుద్ధి చేయించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగునీరు అందిస్తే బాగుంటుందని ఇక్కడి ప్రజలు అన్నారు. మొత్తంగా రాష్ట్రానికి నీరందినా ఈ గ్రామాలకు మంచినీటి పథకం అందని ద్రాక్షగా మారింది.
కృష్ణానది నుంచి నీళ్లను సరఫరా చేయాలి
మండలంలో రెండు నదులు పారుతున్న నది సరిహద్దులో ఉన్న గ్రామాలకు నీరు అందడం లేదంటే ఆలోచించవలసిన అవ సరం ఉంది. ఇక్కడ ఉన్నా 6 గ్రామాలకు కృష్ణానది నీటి నుంచి పైప్‌లైన్ ద్వారా పెద్ద ట్యాంక్ ని నిర్మించి శుద్ధించి అందిస్తే ఇక్కడున్న గ్రామాలకు మంచినీటి సరఫరా కష్టాలు తీరుతాయి
- ప్రభాకర్ రెడ్డి,కృష్ణ మండల కాంగ్రెస్ నాయకుడు
నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది
మా గ్రామంలో నీటి ఎద్దడి చాలా తీవ్ర స్థాయిలో ఉంది కొన్ని సంవత్సరం నుండి నీటి సరఫరా మా గ్రామానికి అసలుకే అందడం లేదు, వ్యవసాయ బోరుల నుండి నీళ్ళను తెచ్చుకొని వాడ ుకుంటున్నాము. మిషన్ భగీరథ నీరయితే దేవుడెరుగు.
- జంషర్ బస్వంత్ ,తంగడిగి గ్రామస్తుడు
ఉత్సాహ విగ్రహంలాగా మంచినీటి ట్యాంకులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొచ్చిన మిషన్ భగీరథ నీరు ఇక్కడి ప్రజలకు అందక ఇక్కడి ప్రాంత ప్రజలు మంచినీటి కొరకు నాన తంటలు పడు తున్నారు. పక్కన నదులున్న సాగునీరు, తాగునీరుకి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మంచినీటి కొరకు గ్రామంలో ట్యాంకులు నిర్మించిన ఉత్సాహ విగ్రహాలగా మిగిలినవి.
నల్లె నరసప్ప