Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనపర్తి జిల్లా అధ్యక్షుడు భగత్
- ఘనంగా కేవీపీఎస్ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ -పాన్గల్
సమాజంలో సమానత్వ సాధనే కేవీపీఎస్ లక్ష్యమని కేవీపీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు భగత్ అన్నారు. మంగళవారం పానగల్ మండల కేంద్రం లో కేవీపీఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఎగురవేసి మాట్లా డుతూ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్యాల కోసం మహాత్మ జ్యోతిరావు పూలే, భార తరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అం బేద్కర్ల స్ఫూర్తితో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 24 ఏళ్ల ప్రస్థానంలో అనేక పోరాటాలు నడిపి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించిందన్నారు. కులవివక్ష అంటరానితనం, అసమానతలపై రాజీ లేని ఉద్యమాలు నడిపిందన్నారు. కుల దురాహం కార దాడులు, హత్యలు అత్యాచారాలు ఎక్కడ జరిగినా కేవీపీఎస్ బాధితుల పక్షాన ముందుండి పోరాడుతుందన్నారు. మనువాద ఆలోచనతో పరి పాలన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ, రాజ్యాంగ హక్కులను కాలరా స్తూ, మతోన్మాద విధానాలతో దళితులపై అనేక రూ పాలో దాడులు, దౌర్జన్యాలు పెరిగేందుకు అనేక కుట్రలు చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టా న్ని నీరుగార్చేస్తున్నారన్నారు. భారత రాజ్యాంగంపై ముప్పేట దాడి చేస్తూ దళితులకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా దళితులను అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు వాగ్దానాలు ఇవ్వడమే తప్ప వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. కొత్తగా తెచ్చిన దళిత బంధు పథకం నిర్వాహణలో ప్రభుత్వ డోల్లతనం బయటపడుతుందని విమర్శించారు. దళితులంతా ఐక్యంగా నిలిచి బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే ఆశయాలు సాధన కోసం కేవీపీఎస్ నిర్వహిస్తున్న ఉద్యమంలో పాల్గొని తమ హక్కులను కాపాడుకోవా లని, సంక్షేమ పథకాలు సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు డి.చంద్రశేఖర్, మండల అధ్యక్ష కార్యదర్శు లు జి.మల్లేష్, మల్లెపు నరసింహ, మండల నాయ కులు బాలకృష్ణయ్య, బి.మల్లేష్, శివరాజు, ఆది గోపీచంద్ ఎం.రాములు, శేఖర్ మహేంద్రనాథ్ కురుమయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
బిజినపల్లి: మండల కేంద్రంలో కేవీపీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న మాట్లాడుతూ ఆత్మ గౌరవం, సమానత్వం, కుల నిర్మూలన కోసం, మహా త్మ జ్యోతిరావు పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యం గా కెవిపిఎస్ పోరాడుతుందన్నారు. 24 ఏళ్ల ప్రస్థా నంలో అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ పాలకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారిచే కుటిల యత్నాలు చేస్తోందని, భారత రాజ్యాంగంపై ముప్పేట దాడి చేస్తూ దళితులకు రిజర్వేషన్ల ఫలాలు అందకుండా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ దళితులను అన్ని రంగాలలో నిరాశ్రయుల్నిచేసిందన్నారు. దేశంలో నిరుద్యోగులను పెంచే కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలకులు దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. దళితులంతా ఐక్యంగా తమ హక్కులను సంక్షేమ పథకాలను సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పాతకోట రాములు, సిఐటియు జిల్లా నాయకులు బోనాసి సుధాకర్, కిందికేరి మల్లేష్, దస్తగిరి, రా ములు, చంద్రయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.