Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూరాల ప్రధాన రహదారులు.
- మోకాళ్ళ లోతులో గుంతలమయం.
- భారీ వాహనాలకు తప్పని కష్టాలు.
- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు.
నవతెలంగాణ - ధరూర్
ధరూర్ మండల పరిధిలోని జూరాల డ్యాం వద్ద ఉన్న ప్రధాన రహదారి వాహనదారులకు శాపంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డుపై గుంతలు, గతుకులతో దర్శమిస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. గమ్యం చేరే దాకా నమ్మకం లేదంటున్నారు వాహనదారులు. ధరూర్ మండలం నర్సన్ దొడ్డి చౌరస్తా నుండి జూరాల ప్రాజెక్టుకు వెళ్లే రోడ్లు గుంతల మయంగా మారింది. దీంతో గద్వాల నుంచి మక్తల్, ఆత్మకూరు వంటి ప్రాంతాలకు రాకపోకలు కొనసాగాలంటే జూరాల డ్యామ్ రోడ్డు మీదగా వెళ్లాల్సి ఉంది. గత కొంతకాలంగా భారీ వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారడంతో పాటు.. భారీ వాహనాల రాకపోకలతో ప్రధాన రహదారి గుంతలు మాయంగా మారింది దీనికి తోడు వర్షాకాలం వస్తే ఎక్కడ గుంత , ఎక్కడ ఎంత లోతుందో తెలియక వాటిలో దిగిన వాహనాలు బోల్తా పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని ప్రజలు వాహనదారులు బిక్కుబిక్కుమంటూ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న అధికారులు పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రధాన రోడ్డును మరమ్మత్తులు చేయాలని వాహనాదారులు కోరుతున్నారు.
ఆత్మకూర్ : ఆత్మకూరు పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే రహదారులకు వర్షపు నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దసరా పండుగ నిమిత్తం వివిధ గ్రామాలకు వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లడానికి నిరాశతో ఆత్మకూరు పట్టణం లో చూస్తున్నారా వనపర్తి ఆత్మకూరు వెళ్లే రహదారిలో ఊగచెట్టు వాగు మదనపురం దగ్గర కాజు వే పై నుండి నీరు ప్రవహిస్తుండడంతో వాహనాలు నిలిచిపోయాయి అదేవిధంగా ఆత్మకూరు నుండి అమలాపూర్ మీదుగా మహబూబ్నగర్ వెళ్లే వాహనాలకు అల్లిపురం దగ్గర కోయిల్ సాగర్ డ్యాం నుండి ఐదు గేట్లు తెరవడంతో నీటి ప్రాణం వలన రవాణాకు అంతరాయం కలుగుతుంది, ఆత్మకూరు వడ్డేమాన్ ఎదురుగా మహబూబ్నగర్ హైదరాబాద్ వెళ్లావు రవాణా వాహనాలకు పర్టిపూర్ రిజర్వాయర్ అలుగు పాతరాడం తో వడ్డేమాన్ గ్రామ సమీపంలో నిర్మించిన వంతెన పై నీరు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి, అదేవిధంగా ఆత్మకూరు మరీకల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలకు జిన్నారం దగ్గర మన్నేవాగు ఉధృతంగా ప్రవేశిస్తుంది, జిన్నారం దగ్గర ఉన్న కాజ్ వే పైన కూడా నీళ్లు ఉధృతంగా రావడంతో వాహనాలు నిలిచిపోయాయి ఈ విధంగా ఆత్మకూరు పట్టణానికి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడడంతో ప్రజలు నిరాశతో వారి ఇండ్లకు వెళ్ళుచున్నారు.