Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా సేవాదళ్ సమావేశం జరిగింది.భారత్ జోడోయాలో పాల్గొనడం ఎంతో గౌరవం ఉంటుందని వారు తెలిపారు. ఈనెల 24వ తేదీన మొత్తంలో జిల్లాలోకి రాహుల్ గాంధీ జూడో యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. జిల్లా దాటి వెళ్లే వరకు ఈ యాత్రలో 200 పైగా సేవాదళ్ కార్యకర్తలు ప్రతిరోజు పాల్గొనాలని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ జూడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ భాష,సుభాష్ కత్రి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.