Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కందనూలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లోని నల్లవెల్లి రోడ్డుకు వెళ్ళే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కల్వర్టు పూర్తిగా కోసుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్న అధికారులు స్పందించకపోవడంతో అధికారుల చర్యల నిరసిస్తూ తెలంగాణ పబ్లిక్ ప్రైవేటు రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ ప్రైవేటు రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పొదిల రామయ్య మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని అందులో ప్రధానమైన చౌరస్తా నిత్యం రద్దీగా ఉండే నల్లవెల్లి రోడ్డు కి వెళ్లే మార్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పూర్తిగా కల్వర్టు కోసుకుపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం కళ్ళు మూసుకొని తెరిచినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అందులో ప్రధానంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వెళ్లే ప్రధానమైన రోడ్డు నిత్యం వేలాది వాహనాలు స్కూళ్లకు ఆసుపత్రులకు షాపింగ్ కు బ్యాంకులకు వెళ్లే ఇంతటి ప్రధానమైన రోడ్డులో రోడ్డు పూర్తిగా తెగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నా నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ సంబంధిత మున్సిపల్ కమిషనర్ గాని స్పందించకపోవడం దారుణమైన చర్య అని ఆయన మండిపడ్డారు. దాదాపు 20 రోజుల క్రితం అంబేద్కర్ చౌరస్తా పక్కన మ్యానువల్ పగిలిపోయి గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారిన ఆ గుంత గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఈ గుంత విషయం గురించి ఫోటో తీసి అధికారులు పంపించిన స్పందన కరువైందన్నారు. కాంట్రాక్ట్ అవగాహన లోపం వల్ల డిజైనింగ్ సరిగా లేకపోవడం వల్ల డ్రైనేజీలు సరిగా నిర్మించకుండా తూతూమంత్రంగా నిర్మించడం వల్ల వర్షపు నీరు రోడ్ల మీదికి వచ్చి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నాసిరకమైన డ్రయినేజ్నిర్మించడం వల్ల వర్షపు నీరు సరిగా వెళ్లలేక మురికి కు పాలు గా మారాయని ఆయన అన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత కమిషనర్ అధికారులు స్పందించి అంబేద్కర్ చౌరస్తాలో పాడైన రోడ్డును కల్వర్టును వెంటనే బాగు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్యదర్శి కురుమూర్తి బాబు, కురుమయ్య, వెంకటేష్, మైన్ ఉద్దీన్, బాలస్వామి, మల్లేష్ ,బాల బీర్ ,నరసింహ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.