Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ జే రంజన్ రతన్ కుమార్
నవతెలంగాణ-ధరూర్
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా ఎస్పీ జె రంజన్ రతన్ కుమార్ అన్నారు. పో లీస్ అమరవీరుల సంస్మరణ (ఫ్లాగ్ డే) వారోత్సవాలలో భాగంగా మంగళవారం పోలీసు శాఖ నిర్వహించిన సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్ తొక్కుతూ అందరిని ఉత్సాహ పరిచారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయ కుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకమవుతూ ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజీవ్ మార్గ్, ఫ్లై ఓవర్, కలెక్టరేట్ గుండా జమ్మిచెడు, పుటన్ పల్లి స్టేజి, అనంతపూర్ స్టేజి, ఎర్రవల్లి చౌరస్తా మీదు గా బీచూపల్లి వరకు నిర్వహించారు. ర్యాలీలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, గద్వాల్ డీఎస్పీ ఎన్సిరంగా స్వామి, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మనీయోల్, అలంపూర్ సీఐ సూర్య నాయక్, డీసీ ఆర్బీ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్‌స్పెక్టర్ కుమార్, ఆర్ఐ నాగేష్, పట్టణ ఎస్సైలు హరిప్రసాద్ రెడ్డి, ఎస్సై లు అర్.శేఖర్, సంతోష్, లెనిన్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.