Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం అరించి వేసిందని టీఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రలు మరికల్ దగ్గర టి యు కార్మిక సంఘాల నాయకులు కలిసి ఆయనతో నడుస్తూ కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దృష్టికి జిల్లాల్లో అసంఘటితరంగా కార్మికులు బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఎనిమిది గంటల పని దినం ఎత్తేసి యజమానులకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, సుశీల తదితరులు పాల్గొన్నారు.