Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడని అనుమానాలు
- బీరం, గువ్వలపై పైర్ అవుతున్న ప్రతిపక్షాలు
- ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజకీయ నాయకులు
- భారత్ జోడో యాత్ర, మునుగోడు ప్రచారంతో నాయకుల ఉక్కిరిబిక్కిరి
100 కోట్ల డీల్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన బీరం, అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఉన్నట్లు వార్తలు రావడంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఎమ్మెల్యేలకు ముడుపుల విషయంలో అసలు ఏం జరుగుతోందో ప్రజలకు అంతుచిక్కడం లేదు.ఒక వైపు భారత్ జోడో మరో వైపు మునుగోడు ఎన్నికల్లో నాయకులు క్షణం తీరిక లేకుండా ఉన్న వేళ ఎమ్మెల్యేలు బీజీపీలో చేరడానికి డీల్‌లో నల్గురు ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇద్దరు నాగర్‌కర్నూల్‌కు చెందిన వారు కావడంతో చర్చనీయాంశం అయ్యిది. ఇప్పటికై వరకు ఇటు ఎమ్మెల్యేలు గాని సీఎంగాని ఈ వ్యవహారంపై నోరు మెదపక పోవడంతో సమసపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో రాజకీయం పరిస్థితి. పార్టీ మారితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఇస్తామని బేరమాడారని లనుమానం అంతేకాక ఫామ్‌హౌజ్‌లో మంతనాలు జరిగాయని అంచాన. చివరికి అధికార టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెలేలు ఇచ్చిన సమాచారం మేరకు డీల్ చేదించా మని పోలీసులు స్వయంగా చెబుతు న్నారు.తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, అచ్చంపేట గువ్వల బాలరాజు, కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పీనపాక ఎమ్మెల్యే రేగాకాంతారావులను ప్రలోభ పెట్టారని పిర్యాదులో పేర్కోన్నారు. అయితే ఈవిషయమై బీజీపీకి చెందిన ఎమ్మెల్యేలు, అధ్యక్షుల వాధనలు వేరుగా ఉన్నాయి. ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పుడెందుకు ఎమ్మెల్యేలను కొంటాం. అయితే ఇటువంటి ఎమ్మెల్యేలను కొని ఏమి చేసుకోవాలి అనే వాధనలు ముందుకు తెచ్చారు.అయితే ఇప్పుడెందుకు కొంటాం అన్నారు తప్ప మేము ఎమ్మెల్యేలను ఎందుకు కొంటాం అన్న మాట అన లేదు. ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ మాటలు వింటుంటే పలు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీలనాయకులు అసలు ఏమి జరిగింది. మునుగోడు ఎన్నికల సమ యంలోనే ఎందుకు ఇటువంటి ఘటనలు జరిగాయన్న సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో రాజకీయ నాయకులు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రేస్ మాజీ జాతీయ అద్యక్షులు రాహుల్‌గాంది చేపట్టిన భారత్ జోడో యాత్ర దీపావళికి ఒక రోజు ముందు కర్నాటక నుంచి ఉమ్మడి పాలమూరులో ప్రవేశించింది. రెండో రోజు మక్తల్, మర్రికల్,దేవరకద్ర,మన్నెంకొండ మీదగా మహబూబ్‌నగర్, జడ్చర్ల, బాలనగర్ మీదగా రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటుంది. జోడో యాత్ర విజయవంతానికి కాంగ్రెస్ శ్రేణులు నిమగం అయ్యారు. ఇక మునుగోడు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ మునిగి ఉంది. ఇటువంటి సమయంలో బీజేపీకి చెందిన రాజకీయ దుమారం లేపడం వెనక బీజేపీ దుష్టశక్తులు ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీకి కొత్తేమి కాదు
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం బీజేపీకి కొత్తేమి కాదు. ఇప్పటికే మహారాష్ట్ర,కర్నాటక, గోవా, మద్యప్రదేశ్‌లో మైనార్టీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలను కొని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలపై వివక్ష చూపుతున్నారు. ఇది సరికాదు.
- వర్ధం పర్వతాలు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నాగర్‌కర్నూల్.