Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు రాజగోపాల్ రెడ్డిని నమ్మొద్దు
- ఎఐసీసీ సభ్యులు మధుయాస్కీ గౌడ్
- రాత్రి లాలితంబ ఆలయం సమీపంలో బస
- రంగారెడ్డి జిల్లాకు చేరుకున్న రాహుల్ గాంధీ జోడొ యాత్ర .
- 10 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
- ఇబ్బందిపడ్డ ప్రయాణికులు
నవతెలంగాణ-జడ్చర్ల
ఎఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం జడ్చర్ల మం డలంలో చెరింది.శనివారం సాయంత్రం జడ్చర్ల పట్ట ణంలో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న లాలితంబిక ఆలయం సమీపంలో రాత్రి అక్కడ బస చేసిన ఆయన ఉదయం6గంటలకు తిరిగి భారత్ జోడోయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర సందర్భంగా టీపీసీసీ నియోజక వర్గ ఇంచార్జి జనుంపల్లి అనిరుద్ రెడ్డి రాహుల్ గాంధీ బస ఏర్పాట్లతో పాటు కార్యకర్తలకు భోజన ఏర్పాట్లను చేశారు. జడ్చర్ల నియోజక వర్గంలో రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తల ల్లో నూతన ఉత్సాహం వచ్చింది. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
బాలానగర్ : ప్రజా సమస్యల పైన దేశ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ఆదివారం సాయంత్రం బాలానగర్ మండలంలో ముగిసింది. ఆదివారం ఏడు గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చేరింది. అనంతరం ఆదివారం 11 గంటలకు మండల పరిధిలోని పెద్దాయపల్లి విలేకరుల సమావేశంలో ఎఐసీసీ సభ్యులు మధుయాస్కీ గౌడ్ మాట్లాడుతూ మునుగోడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కోట్లు సంపాదించి బీజేపీ పార్టీలకు పోవడం ఎంతవరకు సమంజసమన్నారు. అటువంటి వారిని నమ్మరాదన్నారు. ఆయన అటువంటి వారికి ప్రజల బుద్ధి చెబుతారని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కోట్లు సంపాదించి ఇంకా అదనము కోట్ల కోసం బిజెపి పార్టీలో చేరటం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు.శనివారం సాయంత్రం జడ్చర్ల నియోజకవర్గం వచ్చిన రాహుల్ గాంధీకి జడ్చర్ల టీపీసీసీ సంయుక్తకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి స్వాగతం పలికారు.అనంతరం జడ్చర్ల మండలం గొల్లపల్లిలో రాత్రి బస చేశారు. ఉదయం ఐదున్నర గంటలకు పాదయాత్రలో బయలుదేరి బాలనగర్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు వెళ్లారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.