Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గొట్టం రాజు
- మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఇండిస్టీ ఏరియాలోని సంఘం కార్యాలయంలో భవన నిర్మాణ జిల్లా 15వ మహాసభ
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే బైకులు ఇవ్వాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గొట్టం రాజు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండిస్టీ ఏరియాలోని సంఘం కార్యాల యంలో జిల్లా 15వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం రంగంలో ధరలు విపరీతంగా పెరిగా యన్నారు. సిమెంటు స్టీలు నిర్మాణరంగ అన్ని రకాల వస్తువులు ధరలు సామాన్యులకు వందనంతా దూరంగా పెరిగాయని వారు అన్నారు. గ్యాస్ పెట్రోల్ వాడే వస్తువుల ధరలు మరింత పైకి పెరిగే వారు అన్నారు. ఈ రంగా కార్మికులంతా రోడ్డున పడి ఆకలితో అలమటిస్తున్నారని వారు ఆరోపించారు. జీఎస్టీ పేరుతో సామాన్యులపై భారాలు వేయడంతో ఉపాధి కోల్పోతున్నారని వారు తెలిపారు. బడా పెట్టుబడి దారులకు రాయి తీలు ఇస్తూ సామాన్య కార్మికులపై భారాలు మోపడం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ మహాసభలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కే గోపాల్ ,జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ప్రసంగించారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గోనెల రాములు, కార్యదర్శి వర్ధ గాలన్న, కోశాధికారిగా తిరుమల్లయ్య, కొత్త కమిటీ ఎన్నుకున్నారు.