Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరచింత
కార్మికులకు- భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫ లమైందని ఐఎప్టీయూ నాయకులు సి రాజు అన్నారు. ఆదివారం మండలంలో మార్క్స్ భవనంలో తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 39 కోట్ల మంది అసంఘటిత కార్మికులలో 10 కోట్ల మంది భవన నిర్మాణా రంగం లో పనిచేస్తున్నారని వారికి భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. లక్షలాది మంది కార్మికులు రాజధానిలకు వలస వెళ్తున్నారన్నారు. పని ప్రదేశాలలో ప్రమాద పరిస్థితులలో మృతి చెందుతున్నారన్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం మె రుగైన వైద్యం అందించేందుకు, పథకాలను అమలు చేయాలని ఆయన డిమాం డ్ చేశారు. నవంబర్ 7న మక్తల్లో జరిగే రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవం తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు మాసలమ్మని, జిలాని, పెయింటర్ యూనియన్ అధ్యక్షు డు కృపన్న, విజరు, అంజి, నాగరాజు, నాయ కులు సామెల్, భక్తరాజ్, ప్రేమ రత్నం, చాకలి వెంకటేష్ రాజు పాల్గొన్నారు.