Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి
నవతెలంగాణ-వనపర్తి
రైతులు ధాన్యాన్ని పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి డిమాండ్ చేశారు. మండలంలోని చిన గుంటపల్లి వరికొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 50మంది రైతులు వరిచేల్లు కోసి కేంద్రానికి తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం వరి కొనుగో లు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి సకాలంలో వడ్లను కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ వెంకట్రావుతో వరి కొనుగోలు విషయమై ఫోన్లో మాట్లాడారు. రెండో తేదీ నుంచి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చైర్మన్ చెప్పారని ఆయన తెలి పారు. ఈ కార్యక్రమంలో రైతులు బాలపీరు, కరుణాకర్, కృష్ణయ్య, శివలీల, రామస్వామి, వెంకటేష్, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.