Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్వీ ఎంఏ శ్రీకాంత్‌కు కలెక్టర్ ఆదేశం
- మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్
- పాఠశాలలు, అంగన్వాడీ, ప్రభుత్వ కార్యాలయాలు,
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ
- పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
- కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నవ తెలంగాణ -నర్వ:మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు మంజూరైనటువంటి పనులను త్వరితగతిన పూర్తిచేసి ఇవ్వాలని ఆర్వీఎంఏఈ శ్రీకాంత్, సంబంధిత కాంట్రాక్టర్లను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. తొలిమె ట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేసి 5వ తరగతి లోపు విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు కషి చే యాలన్నారు. బుధవారం మండలంతోపాటు మండలంలో ని పాతర్చేడు, ఉందేకోడు లంకల,పెద్ద కడుమూరు గ్రామా ల్లో ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నత,జిల్లా పరిషత్ పాఠశాలలతో పాటు అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాల యాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఫస్ట్ వైద్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలల సమస్యల గురించి తెలుసుకొని విద్యార్థు ల హాజరు శాతాన్ని పరిశీలించారు.పర్యటనలో భాగంగా ఉందేకోడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులతో మమేకమై బోర్డ్‌పై కూడికలు, తీసివే తలు లెక్కలను వేసి విద్యార్థుల ద్వారా జవాబులను రాబట్టా రు. తొలిమెట్టులో ఉన్న నిబంధనలు తరగతి అదనపు వేళ లు, బాలసభ ఏర్పాటు పిల్లల ద్వారా యాక్టివిటిలు చేయిం చాలని ఉపాధ్యాయులను సూచించారు. మండల జిల్లా పరిషత్ పాఠశాలలో మన ఊరు, మన బడి మరమ్మతు పను లను పర్యవేక్షించి వారం రోజులలో పనులను పూర్తి చేయా లని ఆదేశించారు. ఉందేకోడ్లోని 2వ అంగన్వాడీ గహ సం దర్శన నిర్వహించారు. ప్రతి బుధవారం నిర్వహించే పిల్లల తల్లులతో సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నిం చారు. విద్యార్థుల ద్వారా అక్షరాలను చువించి ఒక్కక అక్షరా న్ని విద్యార్థుల నోటి ద్వారా పలికించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి గర్భిణిల వివరాలను కేసీఆర్ కిట్‌లో నమోదు చేస్తున్నారా లేదా, 5 - 15లోపు ఉన్న వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న చిన్న పిల్లలలకు మాత్రలను అందచేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మం డ లంలోని జిల్లా, మండల ప్రజాపరిషత్ పాఠశాల మన ఊరు, మన బడి పనులను పరిశీలించి 2వ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీచేసి స్యామ్ మ్యాం పిల్లల వివరాలను అడిగి తెలుసు కున్నారు. కస్తూర్బా పాఠశాలలో భోజన సమయంలో చేరు కున్న కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించా లని మెనూ ప్రకారం భోజనాన్ని వడ్డించాలని ఆదేశించారు. ప్రాథ మిక ఆరోగ్యకేంద్రాలలో పరిశుభ్రతలను పాటించాలని ఆదే శించారు. అంగన్వాడీలో వేయింగ్ మిషన్ ద్వారా పిల్లల బరువును పరిశీలించి పిల్లల పర్యవేక్షణ కార్డ్‌లో నమోదు చే స్తున్నారా లేదా విషయాన్ని కార్డ్‌లను పరీక్షించారు. రైతు వేదికను సందర్శించి రైతుల ఈకెవైసీ పెండింగ్ ఉన్న వాటి రైతులను సంప్రదించి వాటిని త్వరగా పూర్తిచేయలన్నారు. ఈ కార్యక్రమ్మ లో అధికారులు శ్రీనివాస్, పద్మనాలిని, నర్వ తహసిల్దార్ దయాకర్ రెడ్డి, ఎంపీడీవో రమేష్ కుమార్, ఎంపీపీ జయ రాములు, వైస్ ఎంపీపీ వీణావతి, ఆయా గ్రామాల సర్పంచులు కరుణాకర్ రెడ్డి, నెల్లూరు పావని, సంధ్య, ఉమా రాయిరెడ్డి, శశిరేఖ, ఇతర పంచాయతీ ప్రజాప్రతినిధులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.