Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాధికారి గోవిందరాజులు
నవతెలంగాణ - తెలకపల్లి
విద్యార్థినిలు కష్టంతో కాకుండా ఇష్టంగా ప్రణాళిక బద్ధంగా చదివితే తాము అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని రాకొండలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా వారు మా ట్లా డుతూ విద్యార్థులు చదువులో విజయం సాధించడానికి ప్రణాళికను రూపొం దిం చుకోవాల అని సూచించారు. ఏదైన కారణం చేత ఇప్పటి వరకు బాగా కష్టపడని విద్యార్థులు రానున్న పరీక్షల నాటికి కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిం చవచ్చని సూచించారు. విద్యార్థులు తాము అనుకున్న మంచిఫలితాలు రావడానికి ఇప్పటినుంచే ప్రణాళికతో కష్టపడి చదివే అలవాటు చేసుకుంటే వచ్చే ఇంటర్, పదోతరగతి పరీక్షల నాటికి మంచి ఫలితాలు సాధించొచ్చన్నారు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఆర్టిలను ఆదేశించారు. విద్యార్థుల విద్య ప్రమాణాలపై సీఆర్పీలదే పూర్తి బాధ్యత అన్నారు. కేజీబీవీలో విద్యార్థినుల వసతు లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎస్వో ను ఆదేశిం చారు. మెనూప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఈ కా ర్యక్రమం లో జిల్లా సెక్టోరియల్ అధికారి సతీష్ కుమార్, ఎస్వో హసీనా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.