Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బల్మూరు
మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను డీఆర్డీవో బుధవారం పరిశీలించారు. మండలంలోని జినుకుంట కొనసాగుతున్న ఎవెన్యూ ప్లాంటేష న్ను చూశారు. అక్కడ పనిచేస్తున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనులు చేస్తున్న వారికి త్వరగా పేమెంట్ వచ్చేలా చూడాలని ఏపీవోకు సూచిం చారు. కొండారెడ్డిపల్లిలోని రెవెన్యూ ప్లాంటేషన్‌ను సందర్శించారు. ప్లాంటేషన్లను సక్రమంగా నిర్వహించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గోదల్లో తెలంగాణ క్రీడాప్రాంగణం ఆవరణలో మొక్కలను నాటించారు. అక్కడ ఏం చేస్తున్న వర్కర్ల సమస్యలు తమకు సకాలంలో పేమెంట్లు ఇవ్వాలని కోరారు. వారికి త్వరగా పేమెంట్ వచ్చేలా చూడాలని పేమెంట్ల విషయంలో ఆలస్యం చే యరాదన్నారు. పనిలో నెలకువలు పాటిస్తూ సులభతరంగాను ఉండేరకంగా చూ డాలని తెలిపారు. అనంతరం లక్ష్మీపల్లిలో, చెంచుగూడెంలో అంగన్వాడీ కేంద్రాల సందర్శించి అక్కడ పిల్లల యొక్క క్షేమ సమాచారాలను తెలుసుకున్నా రు. అంతే కాకుండా అక్కడ ఉండే గర్భిణులకు, విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఆశా కార్యకర్తలతో మాట్లాడి గర్భిణిలకు ప్రత్యేకంగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించే విధం గా చూడాలని తెలిపారు. మండలంలోని ఐకేపీకి సంబంధించిన సీసీలతో మా ట్లాడి మహిళ సంఘాలు అందరికీ బ్యాంకు లింకేజ్, శ్రీనిధి ద్వారా లోన్స్ ఇప్పిం చాలని తెలిపారు. గ్రామంలో జరిగే ప్రతి మీటింగ్ కూడా సర్పంచులను తప్పని సరిగా పిలవాలని తెలిపారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచు లు, ఎంపీటీసీలు మరియు ఈజీఎస్ సిబ్బంది, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.