Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణాలు ఐదు
- నిర్మాణ అనంతరం విజిలెన్స్ కు లేఖల?
- పాలకులు ఉన్న గాడి తప్పిన పరిపాలన
- పట్టించుకొని మున్సిపల్ అధికారులు
నవతెలంగాణ- జడ్చర్ల
మున్సిపాలిటీ ఏర్పడి రెండేళ్లు కావస్తున్న ఇంకా గ్రామపంచాయతీ అనుమతులతోనే జడ్చర్లలో బహుళ అంతస్తులు నిర్మాణం కావడం ఇంతకు గురిచేస్తుంది. వివరాల్లోకి వెళితే కావేరమ్మపేట గ్రామపంచాయతీని రెండేళ్ల క్రితం మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఏప్రిల్ లో జడ్చర్ల మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పాటయింది. కానీ అప్పటి కావేరమ్మపేట గ్రామపంచాయతీ అధికారులు ఇచ్చిన జి ప్లస్ టు భవన అనుమతులతోనే ఇంకా అక్కడ బహుళ అంతస్తులను నిర్మిస్తున్నాడు విశేషం. మున్సిపాలిటీలో పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా జి ప్లస్ టు అనుమతులతో ఐదు అంతస్తుల భవనాలను నిర్మిస్తున్న పూరపాలక కమిషనర్ టిపిఓ లేదా వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు కానీ పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇటీవల బాదేపల్లి సిగల్ గడ్డ సమీపంలో అనుమతులు సరిగ్గా లేవని సెట్ బ్యాక్ లేదని అధికారులు భవనాన్ని కూల్చి వేసేందుకు ప్రయత్నించారు. కానీ కొద్దీ రోజుల తరువాత అదే భవనం తిరిగి నిర్మాణం కావడంతో అధికారుల పనితీరు చేతివాటం చెప్పకనే చెప్తుంది. ఇప్పుడు 10వ వార్డులో పోచమ్మ గుడి ప్రధాన రహదారి పై కేవలం రెండు అంతస్థుల గ్రామ పంచాయతీ అనుమతులతో ఏకంగా ఐదు అంతస్తులు నిర్మిస్తున్న ఎవరికి పట్టకపోవడం చూస్తే పాలకుల, అధికారుల పనితీరు అద్భుతం అని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం
10వ వార్డులో నిర్మిస్తున్న కొత్త భవనానికి గ్రామ పంచాయితీ అనుమతులున్నాయి. గ్రామ పంచాయతీ కేవలం రెండు అంతస్థుల కు మాత్రమే అనుమతులు ఇస్తారు. కానీ ఇక్కడ ఐదు అంతస్తులు నిర్మిస్తున్నట్లు మా దష్టికి వచ్చింది. మేము విజిలెన్స్ అధికారులకు పిర్యాదు చేస్తాం. పట్టణంలో ఎవరు కూడా అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన, సెట్ బ్యాక్ వడలకున్న ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుటాం. .
- కమిషనర్ షైక్ మహమ్మద్