Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ లో తన చాంబర్లో 2వ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులంతా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కార్యక్రమాలు అమలు తీరు పై కేంద్రీకరించి పనిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. గ్రామాలలో పెన్షన్లు ఉపాధి హామీ పల్లె ప్రగతి గ్రామీణ క్రీడలు పల్లె ప్రకృతి వనాలు వంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతు న్నాయని వారు అన్నారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు అందిస్తున్న నీటి సరఫరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్న కార్యక్రమాలు జాప్యం లేకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ఆగవద్దని సూచించారు. ఈసారి వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్లతో చర్చించి అన్ని ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు తెలిపారు. గ్రామీణ యువకులకు ఉపాధి కల్పించే శిక్షణాలను ఇవ్వాలని ఉపాధి చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోయిలకొండ జడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి డిప్యూటీ సీఈవో నాగప్ప పాల్గొన్నారు.