Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం డ్యాం రేవులపల్లి గ్రామంలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగున్ని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్ జిల్లా అధ్యక్షులు భగత్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత దేశానికి తన సర్వస్వం దారబోసి రాజ్యాంగం రాశారన్నారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు అనేక హక్కులు కల్పించి సమాజ మార్పుకోసం పాటుపడిన మహనీయుడని ఆయన కొనియాడారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం డ్యాం రేవులపల్లి లో అంబేద్కర్ విగ్రహం తిరిగి పున:ప్రతిష్టించాలని, దుండగున్ని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంధం గట్టన్న, జిల్లా నాయకులు చంద్రశేఖర్, మల్లేష్, బిసన్న, మల్లేష్, ఖాజా, శివ, కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు : పెబ్బేరు మండలం జోగులాంబ గద్వాల జిల్లాలోని డ్యాం వేములపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితుని కఠినంగా శిక్షించాలని పెబ్బేరు మండలం చెలిమిళ్ళ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బుధవారం పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై రామస్వామికి అలాగే తహసీల్దార్ కార్యా లయం నందు డ్యూపూటీ తహసీల్దార్ విజయసింహ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం స్థానిక సుభాష్ చౌరస్తాలో చెలిమిల్ల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు టి మహేష్ మాజీ అధ్యక్షులు గాడి మోడీమన్నెం మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా డ్యాం రేవులపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు పట్టపగలు గ్రామంలోని స్థానికులు చూస్తుండగా మధ్యాహ్నం సమయంలో మతోన్మాద కుల దురాహంకారంతో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి టి అశోక్ ఉపాధ్యక్షులు లక్ష్మన్న క్యాషియర్ టీ కష్ణ జి రాములు కే రాములు జి గౌరయ్య టి రాజు జి పెద్దయ్య జి కుక్కన్న జి బాలరాజు జీ మనోజ్ కే అర్జున్ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పెద్దమండడి : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్మార్గున్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బుధవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు గట్టు మన్నెం డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, అదే స్థానంలో అంబేద్కర్ కౌంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.