Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి అయకట్టుకు అందని సాగునీరు
- భూనిర్వాసితులకు నష్టపరిహారమేది ?
- పీఎం ప్రణామ్ పేరుతో రైతులకు కష్టాలు
- పాల ఉత్పత్తులపై జిఎస్టీ నిలిపేయాలి
- నాగర్కర్నూల్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు
నూటికి 80 శాతం మంది ఆధార పడి జీవిస్తున్న వ్యవసాయంపై పాలకులు వివక్ష చూపుతున్నారు. సాగునీరు అందిస్తున్నామని చెబుతున్న... చివరి ఆయకట్టు నీరు లేక బీళ్లుగా మారుతోంది. ఏళ్ల తరబడి సాగు చేసిన అటవీ,పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళనలు చేసినా పాలక వర్గాలు పట్టించుకోవడం లేదు. జీఎస్టీ రైతుల పాలిట గుదిబండగా మారింది. రుణమాఫీ చేయకపోవడంతో కొత్త రుణాలు ఇవ్వడం లేదు. కల్వకుర్తి , పాలమూరు రంగారెడ్డి లిప్టుల పరిధిలో నూతనంగా రిజర్వాయర్లు నిర్మించి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని పలు పార్టీలు, రైతు సంఘం నాయ కులు కోరుతున్నారు.రేపటి నుంచి జరిగే రైతు సంఘం జిల్లా మహాసభల సందర్బంగా ప్రత్యేక కథనం.
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో సాగుమీద ఆధార .పడిజీవించే వారు నూటికి 80 శాతం ఉన్నారు. పాలకులు ఎవరు మాట్లాడినా... రైతుల సమస్యల గురించే మాట్లాడుతారు. అయితే వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమౌ తున్నారు. వనపర్తి, నాగర్కర్నూల్, జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే కల్వకుర్తి లిప్టు నేటికి లక్ష్యం నెరవేరడం లేదు. కల్వకుర్తి, అచ్చంపేటతో పాటు తలకొండపల్లి మండలాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఉపకాల్వలు, స్ట్రక్ఛర్ నిర్మాణాలు పూర్తి కాలేదు. ముఖ్యంగా వట్టెం, నార్లాపూర్, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పరిధిలో మునిగిన భూ నిర్వాసితులకు నేటికి పరిహారం అందలేదు. ఇక పాలమూరు రంగారెడ్డి పనులు జరుగుతున్నా..భూ నిర్వాసితులకు పరిహారం అందలేదు.ఏదుల రిజర్వాయరు పనులు పూరైనా... బాధితులకు ఇంటి నిర్మాణం భూమికి పరిహారం అందలేదని అందోళనలు చేస్తున్నారు.
అటవీ భూములను నమ్ముకొని ఏండ్లతరబడి భూములను సాగు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అచ్చంపేట అటవీ ప్రాంతంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న వారు వేలల్లో ఉన్నారు. వీరికి పట్టాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అటవీ, పోడు భూములను సాగు చేసుకుంటున్న 150 మందికి పట్టాలు తయారు చేశారు. అయినా.. ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. 2006 వరకు సాగులో ఉన్న వారికి గాకుండా 2014 జూన్ 2 వరకు సాగులో ఉన్న అందరికి పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా పిఎం ప్రణమ్ పేరుతో కేంద్రం ప్రభుత్వం రసాయానాలతో గాకుండా కేవలం సేంద్రీయ సేద్యం చేయాలని సూచి స్తోంది. ఈ విధానం అయితే దిగుబడి తగ్గి ఆహార కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పాడి ఉత్పత్తుల మీద జీఎస్టీని విధిస్తున్నారు. ఈవిధానం వల్ల వినియోగ దారుల మీద తీరని భారం పడుతోందని రైతులు,ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, అనుబందంగా పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కారం చేయాలని రుణమాఫితో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.
రైతులు అనేక సమస్యలు ఎదురుకుంటున్నారు.
జిల్లాలో రైతులు అనేక సమస్యలు ఎదురుకుం టు న్నారు. ముఖ్యంగా ధరణి వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్నా యి. పట్టాలు మార్పిడి చేయా లన్నా... పేరు మార్లా లన్నా. .విరసత్ చేసుకో వాలన్నా.. ఇబ్బందులు ఉన్నాయి. మిస్సింగ్ , ప్రభుత్వ భూముల ఆప్షన్ రాలేదు. దీంతో వేలాధి ఎకరాలు పట్టాలకు నోచుకోవడం లేదు. పభుత్వం అమలు చేయకపోతే మరో ఉద్యోమాన్ని చేపడతాం.
- శ్రీనివాసులు,రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నాగర్కర్నూల్
రేపటి నుండి రైతు సంఘం జిల్లా మహాసభలు
రేపటి నుండి నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతు రెండో మహాసభలు నిర్వహించనున్నారు. ఈ సభలకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి, పెసర కాయల జంగారెడ్డి, తదితరులు హజరు కానున్నట్టు తెలిపారు.