Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీ రోడ్ల నిర్మాణంతో మెరుగైన రవాణా సౌకర్యం
నవ తెలంగాణ- కల్వకుర్తి
కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రహదారులకు మహర్దశ వచ్చింది. పట్టణంలో పలు కాలనీలలో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టడంతో వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగింది. మిషన్ భగీరథ నిధులు దాదాపు రూ.50 కోట్ల రూపాయల నిధులు మంజూరుకాగా అందులో దాదాపు రూ. 6 కోట్ల రూపా యలతో పట్టణంలో సీసీరోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ రోడ్ల నిర్మాణం నా ణ్యతగా పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా వేశారు. విద్యానగర్ కాలనీలో నాగర్‌కర్నూల్ చౌరస్తా నుంచి గ్యాస్‌గోదాం మీదుగా సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంతో విద్యానగర్ కాలనీకే అందం వచ్చింది. వార్డు కౌన్సిలర్ చైతన్య కిషోర్‌రెడ్డి చొరవతో ఈ రోడ్డు నిర్మాణం చేశారని స్థానికులు అభిప్రాయపడుతు నా ్నరు. అదేవిధంగా సిల్వర్ జూబ్లీ క్లబ్ నుంచి రమ్య హాస్పిటల్ వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బస్టాండ్ కూరగాయల మార్కెట్ కు వెళ్లడానికి లింక్ రోడ్డు కావడంతో ఈ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ చౌరస్తా నుంచి కూరగాయల మార్కెట్ వరకు నిర్మించిన రోడ్డు వల్ల అటు వాహనదారులకు ఇటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడింది. అదేవిధంగా సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదురుగా బ్రహ్మంగారి టెంపుల్ వీధిలో వికాస్ టెక్నో స్కూల్ వరకు నిర్మించిన సీసీరోడ్డు విద్యానగర్ కాలనీ ప్రజలకు ఎంతో ఉపయో గకరంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణంలో కళ్యాణ్ నగర్, తిలక్ నగర్ ఆంధ్ర బ్యాంక్ రోడ్డు తదితర రోడ్ల నిర్మాణంతో కల్వకుర్తి పట్టణం అందంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల కృషితో రోడ్లు అభివృద్ధి చెందుతు న్నా యని ఆయా కాలనీల వాసులు అభిప్రాయపడుతున్నారు.
పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి
మున్సిపాలిటీని అన్నిరంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతు న్నాం. ముఖ్యంగా అంతర్గత రహదారుల ని ర్మాణంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మా ణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాం. పట్ట ణంలో ఇప్పటికే చాలా కాలనీలలో సీసీరోడ్ల ని ర్మాణం చేపట్టాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణపనులు సైతం కొనసాగుతున్నా యి. ప్రజల సహకారంతోటి పట్టణాన్ని అబివృద్ధి పంచడానికి కృషి చేస్తున్నాం.
-మున్సిపల్ చైర్మన్ సత్యం