Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పి ఉదయ్ కుమార్
నవ తెలంగాణ -కందనులు
16 సంవత్సరాలలోపు పిల్లలకు వచ్చే ధనుర్వాతం, కోరింత దగ్గు (టేటా నస్ డిప్తిరియా ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ఆన్ని ప్రభుత్వ శాఖలు పకడ్బందీగా కృషి చేయాలని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య శాఖ ద్వారా టేటానస్ డిప్తిరియా వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ధనుర్వాతం, కోరింత దగ్గును సమూలంగా నిర్ములించడానికి నవంబర్ 7నుంచి 18వరకు, 10-16 సంవత్సరాల వయస్సు పిల్లలకు టేటానస్ డిప్తిరి యా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వనుందన్నారు. పిల్లలకు వచ్చే టేటానస్ టెక్సాయి డ్, (ధనుర్వాతం) డిప్తిరియా ( కోరింత దగ్గు) ఇవి చాలా ప్రమాదకరమైనవని, వీటికి మందులు సైతం ఉండవన్నారు. అందువల్ల ఈ వ్యాధులు రాకుండా ఉండేందుకు చిన్న పిల్లలకు పెంటా వ్యాక్సిన్ ఇప్పటికే ఇస్తున్నట్లు తెలిపారు. 5 సంవత్సరాలు దాటిన పిల్లకు వ్యాక్సిన్‌పై పట్టించు కోమని కానీ పిల్లలకు 10 -16 సంవత్సరాలు అంటే 5-10వ తరగతి విద్యార్థులకు ఈ టీడీ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఈ వయస్సు పిల్లలు మొత్తం 24,500 మందిని గుర్తించినట్లు తెలిపారు. వీరికి ఉచితంగా టీకా ఇవ్వడానికి వ్యాక్సిన్ అం దుబాటులో ఉన్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 5-10వ తరగతి విద్యార్థులతోపాటు బడిబయట ఉన్న ఈ వయ స్సు పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు బడిబయటి పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పిం చేందుకు అంగన్వాడీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సన్నద్ధం కావాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా సుధాకర్లాల్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ రవి కుమార్, మున్సిపల్ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి పాల్గొన్నారు.