Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ జివి రమేష్
నవతెలంగాణ - తిమ్మాజిపేట
దళిత బంధు పథకంలో మంజూరైన లబ్ధిదారులు కోళ్లఫారాల షెడ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ జివి రమేష్ లబ్ధిదారులకు సూచించారు. మండలంలో ఉన్న పశువైద్యా కార్యాలయంలో పశువైద్యాధికారి శ్రావణితోపాటు దళిత బందు పథకం కింద మంజూరైన ఐదుమంది లబ్ధిదారులతో సమావేశమయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్వరగా కోళ్ల షెడ్లును నిర్మించుకుంటే శీతాకాలంలో కోడిపిల్లల పెంపకం అనువుగా ఉండ టం వలన రైతులకు అధిక లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. అనంతరం మండలంతోపాటు మసీదుకుంట, అమ్రునాయక్ తండా సూర్య నాయక్ తండలో పశువులకు టీకాలు వేశారు. పశువులకు కొత్తగా పెద్ద గడ్డలు గుండ్రంగా గట్టిగా చర్మం కింద ఉబ్బి ఉంటాయి గడ్డలు పగిలినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పురుగులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. వీటి నివారణకు సాయంత్రం సమయంలో దోమలు, ఈగలు వాళ్లకుండా వేపాకు పొగకొట్టాలలో పెట్టుకోవాలని సూచించారు. ఈ వ్యాధి రాకుండా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకా లను ప్రతి పశువు వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవివో శ్రీనివాసులు, ఎల్ఎస్ఏ నరేష్, వీఏ తిరుపతయ్య, గోపాలమిత్రలు జగ్జీవన్ స్వామి రైతులు పాల్గొన్నారు.