Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వెంకట్ దాస్
తిమ్మాజీపేట: నవజాత శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆరు నెలల నిండిన తర్వాత ప్రతి శిశువుకు అదనపు పోషకాహారం పాలతో పాటు ఇవ్వాలని జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏం వెంకట్ దాస్ అన్నారు. బుధవా రం మండలంలోని ఆవంచ పీహెచ్సీని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆవం చలో నిర్వ హిస్తున్న గ్రామీణ పోషకాహార దినోత్సవాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, గర్భస్థ సమయంలో తప్పనిసరిగా పౌ ష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రసవ అనంతరం తల్లులు పౌష్టికా రాన్ని తీసుకుంటూ ఆరు నెలల తదుపరి నవజాత శిశువులకు తల్లిపాలతో పాటు అదన పు పోషక ఆహారాన్ని ఇవ్వాలని తల్లులకు సూచించారు. శరీరంలోని వివిధ భాగా లు పెరుగుదలకు పౌష్టికాహారం తోడ్పాటు అవుతుందన్నారు. అర్హులైన నవజాత శిశువులకు, అదనపు ఆహారం అంద చేస్తూ అన్నప్రసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నూతనంగా ప్రారంభమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సేవలను ఈ ప్రాంత ప్రజలకు అధికంగా వినియోగించుటకు ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ప్రోత్సహించలని ఆయన సూచించారు. ప్రతి గర్భిణులు ఆస్పత్రిలోనే ప్రసవించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలో అందిస్తున్న సేవల రికా ర్డుల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రవి కుమార్ నాయక్, ఆరోగ్య పర్యవేక్షకులు ఎండీ గౌస్ స్టాఫ్ నర్సు హేమిమా, మహిళా ఆరోగ్య కార్యకర్తలు మహేశ్వరమ్మ, మంజుల, సత్యమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.