Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగిలి వెంకటస్వామి
నవతెలంగాణ-పెద్దకొత్తపల్లి
మండలంలోని రేవులపల్లిలో కుల అహంకారంతో మంగళవారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కూర రఘు రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగిలి వెంకటస్వామి, పూలే అంబేడ్కర్ సాధన కమిటీ మండల అధ్యక్షుడు గండు వెంకటయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేశారు. అంతకుముందు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సాల్వాది వెంకటయ్య, మాదిగ ఎమ్మార్పీఎస్ మాజీ ఉపాధ్యక్షుడు వంగూరి రాంప్ర సాద్, బుడగ జంగాల రాష్ట్ర నాయకులు ఎన్ కృష్ణయ్య, గంట్రావుపల్లి సర్పంచ్ పగిడాల చెన్నయ్య, గుర్రాల బాలస్వామి, గాదరి చంద్ర శేఖర్, పడాల మహేష్, అగ్ర స్వామి, రాజమౌళి, బొల్లి జగన్ పాల్గొన్నారు.
ధరూర్: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కూర రఘు రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు బండారి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రేవులపల్లిలో బుధవారం ఏర్పాటుచేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు.. అంబేద్కర్ మహానియుడి విగ్రహాలు ధ్వంసం చేసే కుట్రలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమాశంలో మండల కన్వీన ర్ ప్రకాష్, కన్వీనర్ గోకరాన్న, పోరాట సమితి మండల సమన్వయకర్త నెట్టెంపాడు గోవిందు, రాము, జగదీష్, కావలి రాంబాబు, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
నవతెంగాణ- కోడేరు
ధరూరు మండలం రేవులపల్లి గ్రామానికి చెందిన మున్నూరు కాపు రఘు అనే వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమని, దుండగుడినీ కఠినంగా శిక్షించాలని మండల అధ్యక్షుడు మిద్దె రామకృష్ణయ్య, ఎంఎస్ఎఫ్ నాయకుడు శివ డిమాండ్ చేశారు.
నవతెలంగాణ- పెంట్లవెల్లి
ధరూర్ మండలం రేవులపల్లిలో మంగళవారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షు డు తలారి హన్మంతు డిమాండ్ చేశారు. ఈ అమానుష ఘటనను ప్రజాసంఘాలు కుల సంఘాలు ఖండించాలని పిలుపునిచ్చారు.