Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు
నవతెలంగాణ -పెంట్లవెల్లి
మండల కేంద్రంలో శుక్రవారం, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బీజేపీ కేంద్ర ప్రభుత్వం, చేస్తున్న కుట్రలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు బట్టబయలు చేసి వాళ్ల నిజాయితీని చాటుకున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఉద్దేశంతో ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.100 కోట్లుకు కొనుగోలు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే, ఆ 100కోట్లను గడ్డి పూసల తీసి పడేసిన మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ అడ్డదారిలో ఎమ్మెల్యేలు కొనడం ప్రభుత్వాన్ని కూల్చడం చేస్తున్న లాంటి కుట్రలు మొత్తం ప్రజాస్వామ్యం అపహాస్యం చేయడమేనని ఆయన కేంద్రాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని, ఇలాంటి అక్రమార్కులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ దేశ రాజకీయాల్లో పెను మార్పు తీసుకురాబో తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మతిన్, టీిఆర్‌ఎస్ నాయకులు సురేందర్‌గౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యులు, అబ్దుల్లా హుస్సేన్, టీఆర్ఎస్ నాయకులు, హన్మంతు, శ్రీనివాసులు, నరసింహ, రవి గౌడ్, ఇంద్ర కుమార్, మధు గౌడ్, వార్డ్ నెంబర్ కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.