Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు
నవతెలంగాణ- ధరూర్
100కోట్లకు ఎమ్మెల్యేలను కొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వా విధానాలు పనికిమాలినవని సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు విమర్శించారు. శుక్రవారం గద్వాలలో సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడి యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాంహౌస్లో బీజేపీ జరిపించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు. నిన్న సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రే బీజేపీ బెరాల ముఠా బండరాన్ని వీడియోలు, ఆడియోలు ఆధారా లను బయట పెట్టారని అన్నారు. ఇప్పటికే ఎనిమిది రాష్ట్ర ప్రభు త్వాన్ని కూల్చాం, ఇంకా నాలుగు రాష్ట్ర ప్రభు త్వాలను కులుస్తామంటూ ఈడీ, సీబీఐలు ఏమి చేయ లేవని మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఈ కొనుగోలు, ప్రభుత్వాన్ని కూల్చే వ్యవ హారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేయించాల ని అవసరమైతే అన్నిర కాల సంస్థలతో సమగ్ర ద ర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి ప్రజలకు దేశానికి మంచిది కాదన్నారు. నరేంద్ర మోడీ, అమిత్షా నాయకత్వంలో దేశంలో ఎన్నడూ జరగని విద్వేష వివక్షత, దోపిడి, దౌర్జన్యం ప్రజాస్వామ్య పునాదులను నాశనం చేస్తుందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తుదాముట్టించేందుకు ప్రజలంద రూ ప్రశ్నించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి బి నర్సింహులు, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు రంగన్న, ఏవైఫ్ నాయకులు చిన్నయ్య, దేవన్న, కర్రెప్ప తదితరులు పాల్గొన్నారు.