Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు చెరువులలో చేప పిల్లల వితరణ
- ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
నవ తెలంగాణ- కోస్గి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పంపిణీ కార్యక్రమం ముదిరాజుల అభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని నాగుల చెరువులో చేపల వితరణను చేపట్టారు. అనంతరం ఉప్పు సముద్రం సమీపంలో మినీ పార్క్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని సైతం పరిశీలించారు. గుండు మాల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చేపల వితరణను చేపట్టారు. పెద్ద చెరువు సమీపంలో రూ. 5 లక్షల రూపాయలతో చేపట్టిన మినీ పార్కును ప్రారంభిం చారు. అనంతరం గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముదిరాజులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. రైతు లకు 24 గంటల్లో ఉచిత విద్యుత్తు, రైతు బీమా, రైతుబంధు, పండించిన ధాన్యాని కి కనీస మద్దతు ధరలు, సబ్సిడీపై ఎరువులు, దళితులకు దళిత బంధు వంటి పథ కాలను అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ, జడ్పిటిసి ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ మధుకర్ రావు, వాయిస్ ఎంపీపీ సాయిలు, పిఎసిఎస్ చైర్మన్ భీమ్ రెడ్డి, వాయిస్ చైర్మన్ వేణుగోపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ మేకల శిరీష రాజేష్, కౌన్సిలర్లు బాలేష్, మాస్టర్ శ్రీనివాస్, బందప్ప, లక్ష్మమ్మ, పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు రాజేష్ తదితరులు ఉన్నారు.