Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీచైర్ పర్సన్ సరిత తిరుపతయ్య
నవతెలంగాణ -ధరూర్
జిల్లా అభివృద్ధి సాధించేందుకు అన్ని శాఖ అధికారులు కృషిచేయాలని జెడ్పీచైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అన్నారు. శుక్రవారం జమ్మిచేడులోని హరిత హౌటల్లో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు.. విద్యుత్ శాఖపై సంబంధిత చర్చించిన అంశాలలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు ట్రాన్స్పా ర్మర్ల మంజూరు తదితర అం శాల గురించి చర్చించారు. త్వరలో విద్యుత్ స్తంభాలు కావా లని జెడ్పీటీసీ కోరారు. విద్యుత్ సౌకర్యం కొత్త కాలనీలకు కల్పించాలని తెలిపారు. మాచర్ల, బల్గెరలో కరెంటు వైర్లు కిందకు వేలాడు తున్నాయని గట్టు జెడ్పీటీసీ తెలిపారు. సా యంత్రం ఐదున్నర కాగానే త్రీ ఫేస్ కరెంటు కట్ చేస్తున్నా రని, ఇటిక్యాల జెడ్పీటీసీ ఆరోపించారు. రాజోలి కొత్త కాలనీ లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కో -ఆప్షన్ సభ్యులు తెలిపారు. ఉపాధి హామీ గురించి మాట్లాడుతూ.. క్రీడా ప్రాంగణాలు 269 పూర్తి అయ్యాయని పీడీ తెలపగా జెడ్పీ చైర్పర్పన్ కేవలం బోర్డులు పాతారని అక్కడ సరైన గ్రౌండ్ ఏర్పాటు చేయడం లేదని అన్నారు. త్వరలో క్రీడా ప్రాంగ ణం అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారి తెలిపారు. వ్యవసా య శాఖ గురించి సంబంధిత అధికారి మాట్లాడు తూ.. జిల్లాలో పత్తిపంట రైతులు నష్టపోయారని దీనికి శాస్త్రవేత్త లు పరిశీలించి ఫలితాలు తెలియజేస్తారని అన్నారు. కొన్ని కంపెనీలు నకిలీలుగా విత్తనాలను రైతులకు ఇస్తున్నారని, వ్యవసాయాధికారులు బ్రోకర్లకు వత్తాసు పలకవద్దని జెడ్పీ చైర్పర్సన్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ గురించి ఆ శాఖ అధికారి మాట్లాడుతూ.. జిల్లాలో పనులు నిర్వహిస్తు న్నామని తెలుపగా కొన్ని రోడ్లకు బిల్లులు రాలేదని సభ్యులు అధికారులు నిలదీశారు. డీఎంహెచ్వో ఆరోగ్యశాఖ గురించి వివరించారు. అనంతరం డీఈవో పాఠశాలల పర్యవేక్షణ చే యాలని జెడ్పీచైర్పర్సన్ ఆదేశించారు. మన ఊరు, మనబడి కార్యక్రమం ద్వారా నాణ్యతగా గదులు నిర్మించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగు నీరు అందిస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. రాజోలి లోని కాలనీకి, స్కూళ్లకు నీటి సరఫరా జరిగేలా చూడాలని రాజోలి సభ్యుడు తెలిపారు. రహదారులు భవనాల శాఖ గురించి సంబంధిత అధికారి జిల్లాలోని రోడ్ల పరిస్థితి గురిం చి వివరించారు. హరితహారం కింద నాటిన మొక్కలను రైతు లు తొలగిస్తున్నారని రోడ్డు బార్డర్ వరకు హద్దులు పాతాలని సభ్యులు కోరారు.
అనంతరం పశువైద్య శాఖ జిల్లా పంచాయతీ, బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, మత్స్యశా ఖ తదితర శాఖలపై అధికారులు వారి ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. ఈసమావేశం జెడ్పీసీఈవో విజయ నాయక్, మహిళా శిశు సంక్షేమ అధికారి ముసాయిదా బేగం, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కో-ఆప్షన్ సభ్యులు, గ్రంథాలయ చైర్మన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.