Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనపర్తి రూరల్
వనపర్తి జిల్లా కేంద్రంలోని జ్ఞాన జ్యోతి నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రాజనగరం రాజేష్ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నవోదయ గురుకుల కోచింగ్ సెంటర్ లు అడ్డగోలుగా ఏర్పాటు చేసుకొని నిరుపేద తల్లిదండ్రులతో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని నవోదయ కోచింగ్ పేరుతో నిలువ దోపిడి చేస్తున్నారని తెలిపారు. ఈ కోచింగ్ సెంటర్లకు విద్యాశాఖ అధికారుల అనుమతి లేదని ఆయన అన్నారు. విద్యాశాఖ అధికారులు ఇలాంటి కోచింగ్ సెంటర్ల నుంచి పర్సంటేజీలు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అడ్డాకుల గ్రామానికి చెందిన బాలరాజు కుమారుడు మనిచంద్ సోమవారం జ్ఞాన జ్యోతి కోచింగ్ సెంటర్ నుంచి సోమవారం తోటి విద్యార్థుల నుంచి గొడవల కారణంగా కోచింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్లాడు. బాబు తండ్రి బాబుని ఇంటికి తీసుకెళ్లడానికి కోచింగ్ సెంటర్ కు వెళ్తే కోచింగ్ సెంటర్ సిబ్బంది బాబును వెతకగా కనిపించలేదని తెలిపారు. తండ్రి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి బంధువుల ఇంటికి వెళ్ళారేమో అని వెతకడం ప్రారంభించారు. కోచింగ్ సెంటర్ కు వచ్చారేమో అని తెలుసుకునేందుకు కోచింగ్ సెంటర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కోచింగ్ సెంటర్ యాజమాన్యం ఫోన్ ఎత్తలేదని వారు తెలిపారు. ఎట్టకేలకు బంధువుల ద్వారా గురువారం అడ్డాకుల గ్రామానికి చేరుకున్నాడు. ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్ల పై చర్య తీసుకోవాలని వారు కోరారు.