Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి రూరల్ : ఆయిల్ ఫామ్ పంట సాగు మెలకువ లపై శాస్త్రీయ అవగాహన కల్పించు ల కోసం వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధి కారులకు అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల ఆయిల్ ఫామ్ నర్సరీలు తోటలు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ క్షేత్ర ప్రద ర్శనలకు బయలుదేరుతున్న 34 మంది అధికారులకు జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి కే సురేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు కొరకు ఈ సంవత్సరానికి 3000 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్దేశించేదమైనదని జిల్లాలో ఇప్పటివరకు 718 మంది రైతులు 25 28 ఎకరాల మొక్కలకు రైతువాట చెల్లించి కలెక్టర్ ఆమోదం పొంది ఉన్నారని తెలిపారు. ఆమోదం పొందిన వారిలో నేటి వరకు 520 మంది రైతులు 2000 ఎకరాలలో డ్రిప్ సౌకర్యము ఏర్పాటు చేసుకొని ఆయిల్ ఫామ్ మొక్కలను తమ పొలాలలో నాటుకోవడం జరిగిందన్నారు. ఇంకా 682 మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు కొరకు దరఖాస్తు నమోదు చేసు కున్నారని తెలిపారు. కానీ రైతు వాటాగా చెల్లిం చాల్సిన మొక్కకు 20 రూపాయల చొప్పున చెల్లించి నందున ఆమోదించబడలేదని కావున రైతులు వెంటనే రైతు వాటా చెల్లించి ఆమోదం పొంది ఆయిల్ ఫామ్ సాగు చేసు కోవాల్సిందిగా ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆయిల్ ఫామ్ నాటుకున్న 485 మంది రైతులలో 341 మంది రైతులకు బ్యాంక్ అకౌంట్ల యందు అంతర పంటలు యాజమాన్య ఖర్చుల సబ్సిడీ నిమిత్తం 54,72,890 జమ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే రైతుకు అందజేసేందుకు 12 నెలల వయస్సు ఆయిల్ ఫామ్ మొక్కలు 1 96,000 పెంచబడి ఉన్నాయని కావున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా తమ దర ఖాస్తులను నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. సిద్ధమైనటువంటి మొక్కలను రైతులకు అర్హత ప్రాతిపదికన మొదటి దరఖాస్తుదారునికి మొదటి ప్రాధాన్యత క్రమంలో మొక్కలు అందజేయ బడతాయని వారు తెలిపారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో జత చేయాలని ఇట్టి దరఖాస్తులను ప్రాంతీయ వ్యవసాయ విస్తరణ అధికారికి లేదా ఆయిల్ ఫామ్ కంపెనీ క్లస్టర్ అధికారికి లేదా ప్రాంతీయ ఉద్యాన అధికారికి అందజేయాలని దరఖాస్తులను నవంబర్ 30 .2020 లోపు చేయాలని వారు తెలిపారు.