Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక వర్గం ఏకం కావాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
- పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా మూడవ మహాసభలు
నవ తెలంగాణ- వనపర్తి
కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ధరలమూత మోగిస్తున్నారని, రాబోయే కాలంలో ధరలమూత తగ్గాలంటే ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ప్రభుత్వాలను గద్దె దించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా సీఐటీయూ జిల్లా కార్యాల యంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా మూడవ మహాసభలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సీఐటీయూ జెండాను జిల్లా అధ్యక్షులు ఊసన్న ఎగరవేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ 45 రూపాయలు లీటర్ డీజిల్ 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 45 రూపాయలకు లీటర్ డీజిిల్ వచ్చేదని, ఈరోజు 100 రూపాయలకు పెరిగిందన్నారు. రోజుకు ఆటో డ్రైవర్లు 5 లీటర్లు వాడుతున్నారని, నెలకు రూ. 8650 లు అదనంగా కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్లు దారి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రోజుకు 10 లీటర్లు వాడే బులోరో ఇతర వాహనాలకు రోజు 10 లీటర్లు డీజిల్ వాడితే ఈరోజు 16,500 అదనంగా ప్రభుత్వం దారి దోపిడీ చేస్తుందని విమర్శించారు. 2014లో ఇన్సూరెన్స్ 3,000 ఉంటే ఈరోజు 8200 రూపాయలకు పెంచారని, 5,500 రూపాయలు ఉన్న పిటిమెంట్ చార్జీలు రూ. 22,300 లకు పెరిగింద తెలిపారు.తుఫానులకు గతంలో 3,000 ఉంటే సంవత్సరానికి 32 వేలకు పెంచారని తెలిపారు. , కార్లకు 11,000 ఉంటే ఈరోజు 16 వేలకు పెంచారని విమర్శించారు. చీటికిమాటికి పోలీసులు, వాహన వెహికల్ ఇన్స్పెక్టర్లు కేసులు కట్టి 300 /- నుంచి 500/- 1000 /-రూపాయల వరకు పెనాల్టీలు గుంజుతున్నారన్నారు. 2015లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశము తీర్మానం ప్రకారం డ్రైవర్ల అందరికీ పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలన్నారు. కానీ ఏ ఒక్కరికీ పి.ఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదన్నారు. మోటార్ వెహికల్ చట్టం 2019 రావడంతో కార్పొరేటు సంస్థలకు స్వదేశీ, విదేశీ గుత్త కంపెనీలకు ఈ రోడ్డు రవాణాలో తిమింగళం లాగా తీసుకొచ్చి పెట్టారనిన్నారు. ఈ నిరుద్యోగ యువకులు ఆటోలు చిన్న వాహనాలు కొని బతుకు దేరువు కోసం ఉపయోగించుకొని జీవనోపాధిని పొందుతున్నారన్నారు. ఇప్పుడు ఊబరు, ఓలా లాంటి సంస్థలు వచ్చి మొత్తము చిన్న ఆటో డ్రైవర్లను మింగేస్తున్నాయని విమర్శించారు. ఈఎంఐ, బ్యాంకు లోన్ల పేరు మీద చాలా తీవ్రంగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్నారు.కావున కార్మిక వర్గం అంతా ఒక వర్గంగా ఐక్యమై పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఊసన్న, జిల్లా కార్యదర్శి రాము, జిల్లా నాయకులు ఎన్. కిషోర్, రాజు, శేఖర్ రెడ్డి, బాలకిషన్, నిసార్, జ్యోతి నందన్, శ్రీను, రాజలింగం, రవి ,అంజి ,కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.