Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -అమరచింత
అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని దుంపరు కుంట లో గుడిసెల పోరాటం కొనసాగుతుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి అన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ధూమ్ పాయి కుంటలో లబ్ధిదారులు గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తున్నారు. వాళ్ల దగ్గరకు ఆయన వెళ్లి వారి పోరాటాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. గతంలో 25 సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ వారు అర్హులైన 400 మంది లబ్ధిదారులకు ప్లాట్లను ఇవ్వడం. ఇచ్చిన ప్లాట్లకు పొజిషన్ హద్దులు ఇంత వరకు చూపించలేదని ఆయన తెలిపారు. ఇచ్చిన ప్లాట్లకు పొజిషన్ ఎంతవరకు సీపీఐ(ఎం) వారికి అండగా ఉంటూ పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. లబ్ధిదారులు పోరాటం చేస్తున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. పశ్చిమ అధికారులు స్పందించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి పొజిషన్ హద్దులు చూపించి డబల్ బెడ్ రూమ్ లో నిర్మించి ఇవ్వాలని ఆయన ఈ ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు బి వెంకటేష్, ఆర్యన్ రమేష్, బుచ్చన్న, శ్యాంసుందర్, వీరితోపాటు లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.