Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము
నవతెలంగాణ -ధరూర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము డిమాండ్ చేశారు. మండలంలోని రేవులపల్లిలో గత మూడు రోజుల క్రితం జరిగిన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన రఘు రెడ్డి అనే వ్యక్తిని ఉరిశిక్ష విధించాలని, వనపర్తి జిల్లా, కొత్తకోట మండలంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాల నాయకుల సమక్షంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేశారు. ఈ సందర్భంగా మీసాల రాము మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ సమన్యాయం కోసం కులాల కతీతంగా మతాలకతీతంగా భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి ఆయన విగ్రహాన్ని కూల్చడం హేయమైన చర్యగా భావి స్తున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేస్తున్న కూడా, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. రఘు రెడ్డిని వెంటనే కఠినంగా శిక్షించి నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చే యాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ మార్టిన్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు మాదిగ, గిరిజన బంజారా రాష్ట్ర అధ్యక్షుడు శివనా యక్, తెలంగాణ దళిత దండు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొగులయ్య, కౌన్సిలర్ అయ్యన్న, రమేష్, ప్రశాంత్, అయ్యన్న, బోయేజ్, ప్రేమధానం, ఇజ్రాయెల్, వికాస్, జేమ్స్, రూపాస్, భాస్కర్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.