Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
నవ తెలంగాణ -వెల్దండ
మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే దలిత బందు పథకం కింద మంజూరైన కారును లబ్ధిదారుడికి అందజేశారు. అనంతరం బొల్లం పల్లి నుంచి గానుగట్టు తండా మధ్య ఉన్న వంతెన నిర్మాణాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నివేదిక అందజేయాలని ఎమ్మెల్యే ఆదేశించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బొల్లంపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ పేద ప్రజలకోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విజిత రెడ్డి, ఎంపీపీ విజయ జైపాల్ నాయక్, మండల అధ్యక్షుడు భూపతి రెడ్డి, మాజీ ఎంపీపీ జయ ప్రకాష్, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు భాస్కర్రావు, స్థానిక సర్పంచ్ అపర్ణ తిరుమలరావు, ఉప సర్పంచ్ రాజు నాయక్ టీఆర్ఎస్ నాయకులు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.