Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ- కందనూలు
రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల్ని పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలోని తెలంగాణ రైతు సంఘం రెండో మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి లోపాల పుట్టని ధరల్లో లోపాలను సవరించి రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న పోడు రైతులకు వెంటనే హక్కుపత్రాలు ఇవ్వాలని సాదా బైనా మాల ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతులకు పట్టాలు చేయాలని ఆయన ఈ సంద ర్భంగా డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు నీరిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. జిల్లాలో ప్రాజెక్టుల పేరుతో భూ ములు కోల్పోయిన రైతాంగానికి పరిహారం వెంటనే చెల్లించాలని అవసరమైన పేదలకు ఇండ్ల ఇళ్లస్థలాలు డబల్ బెడ్రూంలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రూ. లక్ష రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, యాసంగి సీజన్లో బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రైతులు పండించే అన్ని పంటలకు మద్ద తు ధరలు ఇవ్వాలన్నారు. కేరళ మాదిరిగా రైతురుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయాలని వెంటనే జిల్లా వ్యాప్తంగా వరికొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి జంగారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం శ్రీని వాసులు, అధ్యక్షుడు బాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దేశ్యనాయక్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, ఐద్యా జిల్లా కార్యదర్శి, కే గీత సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు వి పర్వతాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివవర్మ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న, రైతు సంఘం నాయకులు రమేష్, శివశంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.