Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకులు దయనీయం
- వ్యవసాయ కూలీలకు యాంత్రీకరణ ముప్పు
- కార్మిక శాఖలో గుర్తింపు కరువు
- పనులు లేక పస్తులుంటున్న వైనం
- గ్రామాలల్లో ఉపాధి పని కల్పించాలి
- సీఐటీయూ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య
వలస జీవులకు నిలయంగా ఉన్న పాలమూరులో అడ్డా కూలీల బతుకు దయనీయంగా ఉన్నాయి. వారంలో నాలుగు రోజులు అయిన పనులు లభించడం లేదు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్షలాదిమంది కూలీలు ఎలాంటి జీవనాధారం లేకుండా బతుకుతున్నారు. వీరందరికీ ఉపాధి కార్డులు ఇచ్చి పనులు కల్పించాల్సి ఉంది.ఇప్పటివరకు ఉపాధి పనులను గుర్తించకపోవడం దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రతి కూలీకి పని కనిపించి అడ్డా కూలీలను ఆదుకోవాలని పలు పార్టీలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. సిమెంటు ఇనుము ఇటుక వంటి వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో వ్యవ సాయ పనుల పై 85 శాతం మంది కూలీలు జీవనోపాధి పొందే వారు. ఇప్పుడు 10 ఎకరాలు దున్నే పొలాన్ని ఒక ట్రాక్టర్ గంటలో దున్ను తుంది.చదును చేయడమే కాదు విత్తనాలు సైతం యంతాల ద్వారానే నాటుతున్నారు. తెలకపల్లి మండలంలో 350 కుటుంబా లున్న గ్రామంలో 250 కోడి గిత్తలు ఉండేవి. ఇప్పుడు పైగా ట్రాక్టర్లు ఉన్నాయి. వ్యవసాయ కూలీలు చేసే పనులన్నీ ట్రాక్టర్లు చేయడం చేత గ్రామాలల్లో కూలీలకు పనులు లేకుండా పోయాయి. వ్యవసాయ పనులకు ఆటంకం కలుగు తుందన్న కారణంతో ఖరీఫ్‌లో 30 ఉపాధి పనులు సాంకే తికంగా నిలిపేస్తున్నారు. గద్వాల, వనపర్తి జిల్లాలో పాక్షికంగా పనులుంటే నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ ,నారాయణపేట జిల్లాలల్లో ఉన్న అడ్డా కూలీలకు పనులు లేకుండా పోయాయి. ప్రధానంగా నారాయణపేట, ఊట్కూరు, కోస్గి, వనపర్తి జిల్లా కిల్లాఘణపూర్ నుండి ప్రతి ఏటా వేలాది మంది వలసలు పోతుంటారు కిలా ఘనపూర్ మండలం లోని అధికారిక లెక్కల ప్రకారం 5600 మంది వలసలు పోయారంటే అడ్డా కూలీల బతుకు ఎంత దయ నీయంగా ఉన్నాయని తెలుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి లింగాల బల్మూరు ఉప్పునుంతల అమ్రాబాద్ మండల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
అడ్డా కూలీల బతుకులు దయనీయం
నాగర్ కర్నూల్ మహబూబ్‌నగర్ వనపర్తి నారాయణపేట వంటి జిల్లా కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో అడ్డ కూలీలు ఉపాధిని కోల్పోతున్నారు. యాంత్రీకరణ పెరగడంతో వ్యవసాయ రంగంలో పనులు లేక లక్షలాది మంది కూలీలు నిర్మాణ రంగం వైపు తొంగి చూస్తున్నారు. అడ్డా కూలీలుగా వీరిని గుర్తించి వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని గత కొంతకాలంగా కార్మిక సంఘాలు ఉద్యమ ఇస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రధాన నగరాల్లో ఉపాధి పనులు మెరుగు పరచాలని కోరుతున్నారు.
ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉండే నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులకు ఉపాధి పని లేకుండా పోయింది. ఐటీడీఏ అధికారులు పనులు చేసుకోవాలని చెబుతుంటే అటవీ అధికారులు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇటు ఉపాధి పనులు లేక అటు అడవిలోకి వెళ్లలేక చెంచులు దయనీయంగా బతుకుతున్నారు.
అడ్డా కూలీలను ఆదుకోవాలి
అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కార్డులు ఇవ్వాలి. పని అడిగిన వెంటనే పనులు చూపించాలి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది కార్మికులు ఇప్పటికీ వలసపోవడం ఆందోళన కలిగించే విషయం. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉపాధి ఉద్యోగాలు వస్తాయనుకున్న ఆశాలపై రాష్ట్ర నాయకులు నీళ్లు చల్లుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధి కూలీలను గుర్తించి వారికి కార్డులు ఇవ్వాలి.
- పొదిల రామయ్య , సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగర్ కర్నూల్