Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఉట్కూర్
నవంబర్ 7న మక్తల్‌లో జరిగే రాష్ట్ర రెండో మహాసభలను జయప్రదం చేయాలని ఐఎప్టీయూ నాయకుడు కనక రాయుడు కృష్ణసాగర్ కోరారు. శనివారం మండ లంలోని కొల్లూర్‌లో వాల్‌పోస్టర్లును విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కార్మికసంక్షేమ బోర్డులో రూ. 1800 కోట్లు ఉన్నా ప్రభుత్వం కార్మికులకు అందిం చడంలో వెనకడుగు వేస్తుందని క్లెయిమ్స్ తొందరలోనే బాధితులకివ్వాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో కొ ల్లూర్ అధ్యక్షుడు ఏసప్ప హన్మంతు, రమేష్, విజరు, నర్సింహ, తాయప్ప, సామెల్, తిరుమలేష్, శేఖర్, అశోక్, దావీదు, తాపీ మేస్త్రిలు తదితరులు పాల్గొన్నారు
ధరూర్: ఈ నెల 7న మక్తల్‌లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింతరే వుల కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ చౌరస్తాలో మహాసభలకు సంబం ధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడా రు.. 60ఏళ్లు దాటిన ప్రతి కార్మికుడికి పింఛన్ ఇవ్వాలని, లేబర్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాసభలకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం ఆయన పి లుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్, ప్రేమ రాజు, శేషన్న, మన్యం నారాయణ, శ్రీనివాసులు, నరసింహులు, రాజు, రవి కు రుమన్న, భాష, ఇస్మాయిల్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.