Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్
నవ తెలంగాణ- మక్తల్
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న అఖిలభారత 17వ మహాసభలు జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ అన్నారు. శనివారం స్థానిక అయ్యప్ప డిగ్రీ కళాశాలలో ప్రచార లోగోలు ఆవిష్క రించారు. ఈ సమావేశానికి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు వేణుగో పాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజ్, ఎస్ఎఫ్ఐ జిల్లాప్రధాన కార్యదర్శి నరహరి హాజరై మాట్లాడారు.. 1970లో ఏర్పడిన '' అధ్యయనం - పోరాటం'' నినాదంతో చదువులో ప్రగతిశీల ప్రజాస్వామ్య, సామాజిక న్యాయం, సమానత్వ విద్య వ్యవస్థకు పోరాడుతూ భారత దేశంలో 50 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉందన్నారు. దేశం లో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోరాటా లు ప్రజాతంత్ర హక్కులకై, నిధులకై ఛలో ఢిల్లీ పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. పేదవర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకు అధునాతన విద్యావిధానం పేరుతో విద్యలో సమూల మార్పులు అంటూ నూతన విద్యావిధానం - 2020 తీసుకు రావడానికి అందరూ వ్యతిరేకించాలని కోరారు. భవిష్యత్ భారతదేశ ని ర్మాణానికి, పోరాటాలకు దిక్సూచి కానున్న 17వఅఖిల భారత మహాస భలు 4 రో జుల పాటు హైదరాబాద్ నగరంలో జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు, స్టూడెంట్స్ కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు..