Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలోని బాలకృష్ణాపురం గ్రామ సర్పంచ్ తుకారం నాయక్ , ప్రజా సంక్షేమానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు .ప్రస్తుతం రెండోసారి సర్పంచ్ గా ఎన్నుకోబడినారు. గతంలో 1995 నందు బాలకృష్ణాపూర్, గోపన్ పేట ,కరివేనా, కరివేన తండా, బాలకృష్ణ పూర్ తాండా, బౌసింగ్ తండా, స్కూల్ తండా, మొదలగు అన్నిటినీ కలిపి గోపన్ పేట గ్రామపంచాయతీ ఉండేది. దీనిని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకోబడినారు. ఈ గ్రామాలలో ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా ఉంటారు. అయితే ఎక్కువ శాతం పొలాలు ఉన్నా నీరు లేకపోవడం వల్ల బీడు భూమూలుగా ఉండేవాని తెలిపారు. ఇక్కడ ప్రజలు వలస వెళ్లి జీవనోపాధి గడిపేవారు .ఇట్టి విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి 30 లక్షల లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి 212 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేసినారు. ప్రస్తుతం బాలకృష్ణాపురం గ్రామ పంచాయతీ కావడంతో పోటీలో నిలబడి గెలు పొందారు. ప్రస్తుతం 8 వార్డులో, గ్రామ ఓటర్ జనాభా 1,133, ఐదో తరగతి వరకు పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల కలవు, రెండు అంగన్ వాడీ కేంద్రాలు కూడా కలవు. ఈ గ్రామపంచాయతీ పరిధిలోని కేజీబీవీ పాఠశాల కలదు, ప్రస్తుతం ఇంటర్మీడియట్ వరకు అనుమతి లభించినది, వైద్యం కోసం వారంలో రెండు రోజులు సామూహిక భవనాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు, విద్యుత్ నిమిత్తం 62 కరెంటు స్తంభాలు చేశాము. 20 లక్షలతో సీసీ రోడ్లు ,15 లక్షలతో డ్రైనేజీ పనులు చేయడం జరిగింది . సమీప తండావాసులకు 30 లక్షల రూపాయలతో మిషన్ కాకతీయ ద్వారా మంచినీటి సరఫరా కల్పించారు. ఒక కోటి 20 లక్షలతో కొత్త సబ్ స్టేషన్ మంజూరు అయ్యి ప్రస్తుతం 90శాతం పనులు పూర్తిచేశామని తెలిపారు. గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ క్రీడా ప్రాంగణము, ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా గ్రామానికి కొత్త గ్రామపంచాయతీ భవనం నిర్మించామన్నారు. గ్రామం లో రామాంజనేయ స్వామి దేవాలయంనకు దేవాదాయశాఖ నుంచి 20 లక్షల రూపాయలతో ఆధునికరించబడినది. గ్రామ బస్ స్టేషన్ ఆధునికరణ మరియు ఇక్కడే గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా గ్రామంలో పదిమందికి దళిత బంధు సహాయం 10 మంది కి అందినది, వీరు ట్రాక్టర్, రెండు బోలేరా వాహనాలు ,ఆటో ,టెంట్ హౌస్, మినీ డైరీ ఫారం ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఇట్టి సహాయ సహకారానికి స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేశారు.