Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
2022 డిసెంబర్ 13 నుండి 16 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పురిటిగడ్డ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న అఖిలభారత మహాసభలు జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భరత్ అన్నారు. శనివారం సంఘం కార్యాలయంలో ప్రచార లోగోలు ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ అఖిలభారత మహాసభలకు ఆతిథ్యం ఇచ్చిన మన హైదరాబాద్ మరొకసారి జాతీయ మహాసభలకు ఆతిథ్యం ఇవ్వబోతుందని వారు తెలిపారు. 1970 లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ '' అధ్యయనం - పోరాటం'' నినాదంతో చదువులో ప్రగతిశీల ప్రజాస్వామ్య, ,సామాజిక న్యాయం ,సమానత్వ విద్య వ్యవస్థకై పోరాడు తోందన్నారు. భారత దేశంలో 50 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉంది. దేశంలో నిత్యం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యారంగంలో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా అనేక మిలిటెంట్ పోరాటాలను దేశ వ్యాప్తంగా నడిపింస్తుందని పాలకులు నూతన విద్యాసంస్కరణలు పేరుతో విద్యరంగంలో తీసుకు వస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ,విద్యార్ధులందరిని ఐక్యం చేసిందన్నారు.దేశ సమగ్రతను కాపాడాలని టెర్రరిజం వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నడిపి విద్యార్థులను చైతన్యవంతం చేసిందని తెలిపారు. ప్రస్తుతం దేశాని పాలిస్తున్న పాలకులు భారతదేశ విద్యను అంగడి సరుకుగా మార్చి అణాగారిన, పేద వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకు అధునాతన విద్యావిధానం పేరుతో విద్యలో సమూల మార్పులు అంటూ నూతన విద్యా విధానం - 2020 తీసుకు రావడానికి అందరూ వ్యతిరేకించాలని కోరారు. ఈ విద్యా విధానం పేరుతో చదువుల్లో మత తత్వ విధానాలు, సిలబస్ మార్పులు, మూఢనమ్మకాలు, పెంచేలాగా మార్పులు చేసి విద్యావిధానం ఉందని వారు ఆరోపించారు.. విదేశీ యూనివర్సిటీలను దేశ విద్యరంగంలోకి అనుమతిస్తూ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలను విద్యారంగంలో భాగం చేసే విధానాలను అమలు వ్యతిరేక పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ విధానాలు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. నూతన విద్యా విధానం రద్దు చేయాలని అనేక ఆందోళనలు దేశవ్యాప్తంగ పోరాటాలు చేయడం ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచామని వారు తెలిపారు. దేశంలో కెజీ నుండి పిజీ వరకు పెంచిన ఫీజులను తగ్గించాలని పోరాటాలు కొనసాగిస్తామన్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యా విధానంలో అందరికి విద్యను అందించాలని దేశ వ్యాప్తంగా పోరాడిందన్నారు. భవిష్యత్ భారత దేశ నిర్మాణానికి, విద్యార్థి పోరాటాలకు దిక్సూచి కానున్న 17వ అఖిల భారత మహాసభలు 4 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు, స్టూడెంట్స్ కల్చరల్ ఫెస్ట్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.. ఈ మహాసభలకు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, సెంట్రల్ యూనివర్సిటీల నుండి 1500 మంది ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన అతిథులు పలు దేశాల నుంచి విద్యార్థి ప్రతినిధులు హాజరైతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రూరల్ నాయకులు ఖాసిం, కళాశాల విద్యార్థులు హాజరయ్యారు.