Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటక హబ్ ' పాలమూరు '
- నల్లమల, జూరాలలో అద్బుతమైన దృశ్యాలు
- హబ్ కేంద్రాలుగా అనేక అవకాశాలు
- గుర్తించి అభివృద్ధి చేస్తే... యాత్రికులు పెరిగే అవకాశం
- పిల్లల మర్రి పూర్వ వైభవం
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో అభివృద్ధి చేయాలి : జిల్లా ప్రజలు
వలసలు దారిద్రం వర్షాభావంతో రైతాంగం వెతలు నిరుద్యోగం నిరక్షరాస్యత వంటి ఎన్ని సమస్యలు ఉమ్మడి జిల్లాను వేదిస్తున్నా..పర్యాటక హబ్‌కు అనేక అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శించే స్థాయిలో ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలున్నాయి. పాలకులు చేయవల్సిదల్లా వాటిని గుర్తించి అభివృద్ధి చేయడమే.ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి పర్యాటక మంత్రిగా ఉండి ఈ జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి పర్యాటకులకు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందిన నల్లమల ఉన్న నల్లమల ఉమ్మడి జిల్లాకు తలమానికంగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో అనేక లోయలు, జలపాతాలు ,కొండలు, ఎతైన చెట్లు, వేల రకాల ఔషద మొక్కలున్నాయి. నెమలి, పులి, చిరుత, దుప్పితో పాటు అనేక అడవి జంతువులు మనకు కనిపిస్తాయి. నల్లమలలో సలేశ్వరం, మల్లేల తీర్థం, లొద్ధి మల్లయ్య జలపాతాలు కనువిందు చేస్తాయి. శ్రీశైలం అచ్చంపేట రహదారి మద్యన వటవర్లపల్లి దగ్గర 8 కిలోమీటర్ల దూరంలో మల్లేలతీర్థం ఉంటుంది. ఏతైన కొండల మద్య నుండి లోయలోకి పడుతున్న జలం పర్యాటకులను ఆకర్శిస్తుంది. అదే దారిలో లొద్ధి లోయ ఉంటుంది. ప్రతిఏట తొలిఏకాదశి రోజు విశేషం పర్యాటకులు వస్తుంటారు. బల్మూరు, లింగాల, ఉప్పునుంతల, అచ్చంపేట, మండలాల నుండి లొద్దికి కాలినడకన వెల్తుంటారు. సలేశ్వరం లోయ పర్యాటకులను ఆకర్శిస్తోంది. ఇది శ్రీశైలం వెల్లే రహదారిలో ఉండే పరహాబాద్ నుండి దట్టమైన అడవిలోకి వెల్లాల్సి ఉంది. 7 కిలోమీటర్ల అనతందరం సలేశ్వరం వస్తోంది. అక్కడ నీటి జలపాతం ప్రజలను ఆకర్శిస్తుంది. ఇంకా ఉమా మహేశ్వరం,సోమశీల,పాతాలగంగ వంటి ప్రాంతాలు ఉన్నాయి.వీటి ఆధారంగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కొరుతున్నారు. ముఖ్యంగా నామమాత్రంగా మౌలీక వసతులు ఏర్పాటు చేస్తే యాత్రికుల సందడి పెరుగుతోంది.
కృష్ణా పరివాహక ప్రాంతాలలోనూ...పార్కులు, విడిది గృహాలు, రాత్రి పూట ఉండేందుకు బస, నీరు, మంచి వసతులు ఏర్పాటుతో పాటు నదిలో బోటు సౌకర్యం ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంత ప్రజల జీవన పరిస్థితులు మెరుగు అవడమే గాక ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ముఖ్యంగా సోమశిల,బీచుపల్లి, జూరాల,కొల్లాపూర్‌లో ఎల్లూరు, నార్లాపూర్ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సింది. గతంలో జూరాల దగ్గర పార్కు తో పాటు మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి.కొంత నిధులిచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నారు.కోయిల్‌సాగర్, నెట్టేంపాడు, బీమాతో పాటు కల్వకుర్తి లిప్టు రిజర్వాయర్ల దగ్గర పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా పాల మూరు జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధిని చేయాల్సి ఉంది. గతంలో ఉన్న జింకల పార్కు, జంతువుల పెంపకంను ఇప్పుడు తీసేశారు. సమాంతరంగా కేసీఆర్ పార్కును అభివృద్ధి చేశారు. ఇప్పుడు పెద్ద చెరువును ట్యాంకుబండ్‌గా మార్చుతున్నారని తెలిపారు.సహజంగా వనరులను అభివృద్ధి చేస్తే.. తక్కువ ఖర్చుతో పర్యాటకులకు వసతులు కల్పించిన వారౌతారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పని చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
మంత్రిగా ఉన్న పర్యాటక పనులు సున్నా
ఉమ్మడి జిల్లాలో అనేక వనరులు ఉన్నాయి. పర్యాటక మంత్రి ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయినా. ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమౌతున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మున్ననూర్ దగ్గర అటవీ ప్రాంతంలో విడది గృహాలను ఏర్పాటు చేశారు. ఇక చెంచుల చేత నడిచే హోటల్, చెంచుల సంస్కృతిని తెలిపే ఎగ్జిబిషన్‌ను మూసేశారు. ఇప్పటికైన మంత్రి కలగ చేసుకొని పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.