Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న చింత కుంట : మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలం పరిధిలో కురుమూర్తి స్వామి వెలిసింది. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరను ఆలయం నిర్వాకులు నిర్వహిస్తారు. ఇక్కడికి చూడటానికి ప్రక్క రాష్ట్రం నలుమూలల నుండే భక్తులు వస్తారు. భక్తులు భక్తితో సమర్పించే కొబ్బరికాయలును జాతరలో అధిక ధరలకు విక్రయించడమే కాకుండా కుళ్ళిన నాణ్యతలేని కొబ్బేరి కాయలను భక్తులకు అంటగడుతు నిలువు దోపిడికి పాలుపడుతున్నారని పలువురు ఆరోపించారు. ఆలయ అధికారులుగాని పాలకమండలి గాని పట్టించుకోవడం లేదని కోవడం లేదు. టెంకాయల విక్రయాల కోసం వేలం నిర్వహించి జాతరలో అమ్ముకోవడానికి ఆలయ అధికారులు అను మతిని ఇస్తారు. టెండర్ దక్కించుకున్న వ్యక్తులు నిర్ణీత ధరలకు టెంకాయలను విక్రయిస్తూ భక్తుల నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. టెండర్ దక్కించుకున్న వ్యక్తులు రాజకీయ నాయకుల అండతో నాణ్యతలేని టెంకాయలను విక్రయిస్తూ అక్రమార్జనకు పాలపడుతున్నారు. పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన ఆలయ అధికారులకు ముడుపులు అందుతున్న కారణంగానే చూసుచూడనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.