Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రాలయం నుంచి మహబూబ్నగర్ వరకూ ..
- స్వరాష్ట్రంలో జిల్లాకు తిరిగిరాని వలస కూలీలు
- దీంతో పెరిగిన కూలీల కొరత
- పత్తి తీయడానికి పోరుగు రాష్ట్రం నుంచి వలసలు
- సంక్షేమ పథకాలు అందడం లేదని కూలీలు ఆవేదన
మొన్నటి వరకు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం విన్నాం. ఏర్పడిన తర్వాత ఇప్పటికీ పాలమూరు నుంచి వలసలు తగ్గడం లేదు. లక్షలాది మంది జిల్లా నుంచి వలసలు పోవడంతో వ్యవసాయ పనులు చేయడానికి జిల్లాలో కూలీల కొరత ఏర్పడింది.కర్నూలు,అనంతపురం, నంద్యాల వంటి ప్రాంతాల నుంచి జిల్లాకు కూలీలు వస్తున్నారు. వలసల జిల్లాకే వలసలు వస్తుండడంపై నవ తెలంగాణ ప్రత్యేక కథనం.
నవ తెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
సాగు భూములు లేని వందలాది నిరుపేదలు. పొరుగు రాష్ట్రాల నుంచి పాలమూరు చేరుకున్నారు. ఇక్కడ పరిధిలో సాగు చేసిన పత్తి పంటలల్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా కొస్గి మండలం నేల కోస్గి లో వాల్మీకి బోయలు అధికంగా ఉంటారు. వీరికి ఎలాంటి స్థిర చర ఆస్తులు లేవు. ఏటా ఖరీఫ్ సమయంలో వివిధ ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వ్యవసాయ పనులు లేకుంటే బెంగళూరు వెళ్లి సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తారు. వీరు వలసల జీవులుగా జీవిస్తుండడం వల్ల వీరి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. తమ పిల్లలను వెంట తీసుకొని ఎక్కడ ఉపాధి లభిస్తే అక్కడ వెళ్తూ ఉంటారు. వర్షాకాలంలో నాలుగు నెలలు తప్ప మిగతా ఎనిమిది నెలలు సొంత ఊరికి దూరంగానే వీరు కాలం వెల్లదిస్తారు. రేపు పండ్ల కోసం వచ్చిన కూలీలతో నవ తెలంగాణ మాట్లాడగా అనేక విషయాలు తెలుగులోకి వచ్చాయి. తమకు జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. దేశమంతా ఉపాధి హామీ పనులు జరుగుతుంటే మాకు మాత్రం పనులు చేయకుండా నిధులు దారి మళ్ళిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉంటున్నారు. సొంత ఇంటికి కనీసం జాగా కూడా ఇవ్వడం లేదంటున్నారు. పిల్లలు నాలుగు మెతుకులు తినాలంటే వలసలు పోవాల్సిందేనని కోస్గి మండలం నేల కోస్గి గ్రామానికి చెందిన భీమమ్మ లక్ష్మి రేణుకమ్మ వీరారెడ్డి రామాంజనేయులు తదితరులు వాపుతున్నారు.
వలసల జిల్లాకే వలసలు
స్వరాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి లక్షలాది పేదలు వలసలు పోయేవారు. నారాయణపేట, నాగర్ కర్నూల్, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల పరిధి నుండి 14 లక్షల మంది వలసలు పోయేవారు. ఎక్కువగా ముంబై దుబారు గుజరాత్ వంటి ప్రాంతాలకు పోయి బతికేవారు. ఇప్పటికీ అధికారిక లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల మందికి పైగా వలసలు పోతున్నారు. వనపర్తి జిల్లా ఘణపూర్ మండల పరిధిలోని పదివేల మందికి పైగా వలసలు పోయారు. అత్యధికులు దుబారు, ఆఫ్ఘనిస్తాన్ కువైట్ దేశాలకు పోయారు. ఇంటిదగ్గర పిల్లలు వద్దులు మాత్రమే ఉంటారు. అయితే ఖరీఫ్ సాగుకు అత్యధికంగా కూలీల అవసరం ఉంటుంది. ఉమ్మడి జిల్లా నుండి పోయిన వలసలు తిరిగి రాకపోవడం వల్లనే మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. పాలమూరు కూలీల కొరత తీర్చడానికి వీరు ఇక్కడికి వస్తున్నారు.
సాగు జరగడం వల్లనే
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత ఆరు సంవత్సరాలుగా సాగు విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా వరి ఆరు లక్షల ఎకరాలు పత్తి ఎనిమిది లక్షల ఎకరాలలో సాగయింది. పెరిగిన సాగు పనుకూలంగా కూలీలు దొరకడం లేదు. ముఖ్యంగా కల్వకుర్తి పూతల పథకం భీమా నెట్టెం పాడు కోయిల్ సాగర్ జూరాల ప్రాజెక్టుల కింద పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి వరి పంటలు అత్యంత సాగు చేస్తున్న. ఊరికి పూత పోయ డానికి యంత్రాలు రావడం వల్ల కూలీల సమస్య ఉండదు. పత్తిని తీయడానికి కూలీలు అవసరం ఉంటుంది. కూలీల కొరతను గమనించిన పురుగు రాష్ట్రాలకు కూలీలు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు.
ఏడాది పొడవునా పనులు లేవు
పాలమూరులో ఉంటే మాకు ఏడాదంతా పనులు ఉండవు. ఖరీఫ్ సమయంలో నెల రోజులు మాత్రమే కూలీ పనులు లభిస్తాయి. ఆ తర్వాత పనులు ఉండవు. ఉపాధి హామీ పనులు సైతం అధికారులు చూయించడం లేదు. అందుకే తట్ట బుట్ట సదురుకొని ముంబై పోతున్నాం .
- రేమయ్య , పాలమూరు వలస జీవి
మాకు ఉపాధి లేకే కూలీ పనులకు వచ్చాం
మా దగ్గర ఎటువంటి ఉపాధి హామీ పనులు జరగడం లేదు. కాల్వల్లేక సాగునీరు అందక పంటలు సరిగ్గా పడడం లేదు. పత్తి ఇప్పటికే పూర్తయిపోయింది. ఉపాధి పనులు లేవు. అందుకే పక్క రాష్ట్రమైన పాలమూరుకు వచ్చాము. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉంటే మా రాష్ట్రంలోనే ఉండేవాళ్లం.
- వీరారెడ్డి , కోస్గి మండలం కర్నూలు జిల్లా.