Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి : ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయ సహకారంతో అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను జాప్యం లేకుండా లబ్ధిదారులకు అందించవచ్చని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆయా పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధులు ,అధికారులు సమన్వయంతో పనిచేసినట్లయితే పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందుతాయని అన్నారు .వారి పరిధిలో వ్యవసాయ,విద్య,వైద్యం, గ్రామీణ అభివద్ధి పథకాల అమలులో సమస్యలను అధికారుల దష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ గత జిల్లా పరిషత్ సమావేశాలలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను అధికారులు సభ దష్టికి తీసుకురావాలని ,అదేవిధంగా ప్రతి సమావేశంలో చర్చించే అంశాలపై చర్యలు చేపట్టాలని అన్నారు . వ్యవసాయ శాఖ ప్రగతిపై ఆ శాఖ అధికారి వెంకటేష్ సభకు వివరి ంచిన అనంతరం జిల్లా కలెక్టర్ మాటా ్లడుతూ ధాన్యంకొనుగోలు కేంద్రాలలో భాగంగా ఈ సంవత్సరం జిల్లాలో 191 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఆయా ప్రాంతాలలో ధాన్యం రాకను బట్టి కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడి ంచారు.ధాన్యం అమ్మిన రైతులకు కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సందర్భంగా గత రెండు సీజన్లకు సంబంధించి రావాల్సిన కమిషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. రైతు భీమా అమలులో భాగంగా ప్రతిపాదనలు వచ్చిన వారం రోజుల్లోనే ప్రభుత్వానికి పంపిస్తున్నామని, అదేవిధంగా వ్యవసాయ అధికారులు రైతుబంధు సమస్యలను ఎప్పటికప్పుడే పరిష్కరిస్తున్నట్లు వెల్లడి ంచారు. భూత్పూర్ ఎంపీపీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ హమాలి కమిషన్ ఓకే లా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అన్ని కొనుగోలు కేంద్రాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలలో హమాలీల కమిషన్ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ,గండీడ్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బాలనగర్ జెడ్పిటిసి మోతిఘన్పర్, కోయిలకొండ జడ్పిటిసి, దేవరకద్ర ఎంపీపీ ,జెడ్పిసిఈ ఓ జ్యోతి, జిల్లా అధి కారులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.