Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిన్నదాంట్లో ఒక ముద్ధ పేదోడికి పెట్టాలి
- తెలంగాణ ఉద్యమంలో ముందడుగు.. స్వరాష్ట్రంలో రాని అవకాశాలు
- కల్వకుర్తి ఇంచార్జీ, టీఆర్ఎస్ నాయకులు బాలాజీసింగ్
మన సంపాదనలో కొంత పేదోడికి పెట్టాలి. సమాజంలో ఎంతో మంది సమస్యల్లో ఉన్నారు.వారికి చోదోడు వాదోడుగా ఉండాలి. రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనబడిన తెలంగాణను ప్రత్యేకంగా రాష్ట్రంగా ప్రకటించాలని ఉద్యమం చేశాం. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. మేము తెలంగాణ ఉద్యమంలో ఉండి సొంత ఆస్తులను సైతం అమ్మి ఉద్యమాలను నడిపాం. అయినా తెలంగాణ ఉద్యమ కాలం నుండి నేటి వరకు పార్టీకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాని తెలంగాణ ఉద్యమ నాయకులు జడ్పీ వైస్ చైర్పర్సన్ బాలాజీ సింగ్ నవతెలంగాణతో ముఖాముఖీ.
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నవతెలంగాణ :కుటుంబ
వివరాలు విద్యబ్యాసం గురించి తెలపండి ?
బాలాజిసింగ్ : అమ్మ సుమిత్రాబాయి, నాన్న రతన్‌సింగ్, ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి, పదవి విరమణ పొందారు. మేము నలుగురం అన్నదమ్ములం. నేను పది కల్వకుర్తి, ఇంటర్ కాచిగుడ ప్రభుత్వ కళాశాలలో చదివాను. కిట్స్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. నాలుగు ఏండ్లు ఇక్కడే ఉండి ఆతర్వాత 1999లో సింగాపూర్ వెళ్లాను. కెనడా, సింగాపూర్‌లో గ్రీన్ కార్డు ఉన్నది. సింగాపూర్‌లో సొంత ఇల్లు ఉండేది. అక్కడే సొంత కంపెనీని ఏర్పాటు చేశాను. ఆతర్వాత ఇండియాకు వచ్చాను.2013లొ ఇండియాకు వచ్చాను.2014 నుంచి 2019 వరకు రాజకీయాలలో క్రియా శీలకంగా పనిచేశాను. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ.. కల్వకుర్తి నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించాను.
నవతెలంగాణ : పార్టీని గ్రామ గ్రామాన తీసుకెళ్లీన.. మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఎందుకు రాలేదు.
బాలాజీసింగ్ : టీడీపీ నాయకులు జైపాల్ యాదవ్ టీఆర్ఎస్లోకి రావడంతో తెలంగాణ రథసారధి నన్ను ఆగమన్నాడు. నీకు ఇంకా రాజకీయ అవకాశాలు కల్పించడానికి నేను ఉన్నానని ఓదార్చారు.నేను ప్రతి గ్రామం, తండాలో జెండావిష్కరణ చేయించాను. కల్వకుర్తిలో బలమైన నాయకత్వాన్ని తయారు చేశాం.
నవతెలంగాణ : తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేశారు ?
బాలాజీసింగ్ : నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేయని ఉద్యమం అంటూ లేదు. ముఖ్యంగా 150 దూం దాంలు పెట్టాం.అప్పటికే వివిధ పార్టీల్లో ఉన్న వారిని ఒప్పించి ఉద్యమంలో చేర్పించాం. కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతం చేశాం.మిలియన్‌మార్చ్ , సకలజనుల సమ్మె, వంటవార్పు, ఆర్టీసి బంద్, సాగరహారం ను విజయ వంతం చేశాం. ముఖ్యంగా బతుకమ్మ ఆట పాటను 10 వేల మందితో దిగ్విజయం చేశాం. తెలం గాణ ఆత్మగౌరవ సభ నిర ్వహించాం. అయినా ఉద్యమ బాట వీడ లేదు. ఇంకా సర్పంచుల గెలుపుకోసం నాలుగు ఎకరాలను అమ్ముకున్నాను. ఇంకా ఎల్ఐసీ వెనక ఉన్న భూమి ఇప్పుడు కోట్ల విలువ ఉంటంది. ఉద్యమం కోసం భూములును అమ్ముకున్నాం. ఆస్తులను అమ్ముకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం.
నవతెలంగాణ : ఇంత చేసినా
మీకు ఎందుకు అవకాశం రాలేదు. ?
బాలాజీసింగ్ : అప్పట్లో రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీని కనుమరుగు చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ జైపాల్‌యాదవ్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వా నించారు.2014లో జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఆయనకే అవకాశం కల్పించారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా హామీ నెరవేరలేదు.
నవతెలంగాణ : కరోనా సమయంలో
మీరు చేసిన సేవా కార్యక్రమాలు చేశారు. ?
బాలాజీసింగ్ : ఆర్టీసీ కార్మికులకు కరోనా సమయంలో ఒక నెల జీతం ఇచ్చాను. బాలాజీ చారీటబుల్ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. ఉపాధి కోసం కుట్టుమిషన్లు, స్పోర్ట్సు, కిట్లు, అందజేశాను. మార్చాలలో ఓ అబ్బాయిని దత్తత తీసు కొని విద్యాబుద్ధులు నేర్పించాను. 300 మందికి 10 వేల చొప్పున ఉద్యమంలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందజేశాను. స్థానిక ఎన్నికల్లో ఉద్యమంలో పనిచేసిన వారికి కొట్లాడి పదవులు వచ్చేలా కృషి చేశాను.ఇక నేను జడ్పీటీసిగా చార కొండలో నిలబడాలని కేటీఆర్ చెప్పాడు. నేను నామినేషన్ వేశాక ప్రచారం కోసం ఎవ్వరూ... రాలేదు. అయినా.. 64 ఓట్లు సంపాదించాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జడ్పీ వైస్ చైర్మన్‌గా అయిన తర్వాత అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నాను.
నవతెలంగాణ : మీకు అవకాశం ఇస్తే...
గెలుస్తారన్న నమ్మకం ఉందా ?
బాలాజీసింగ్ : వంద శాతం గెలిచి తీరుతాను అన్న నమ్మకం ఉంది. అభివృధ్ది చేయడంలో వెనకబడ్డారు. సొంత ప్రయోజనం తప్ప ప్రజలకు చేసిందేమి లేదు. అయినా... బీసీ సామాజిక వర్గం అత్యధిక ఓటర్లు ఉన్నారు. కచ్చితంగా గెలిపిస్తారు. జైపాల్‌యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎవరైనా ప్రజల విశ్వాసం కోల్పోయారు. ముఖ్యంగా కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా ఇంకా ఐదు ఏళ్లు ఉంటారు. అందుకే ఈసారి నాకు అవకాశం వస్తుందన్న నమ్మకం ఉంది.
నవ తెలంగాణ : మీరు గెలిస్తే...
ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారు ?
బాలాజీసింగ్ : నియోజకవర్గంలో ఇంకా రోడ్లు వేయాల్సి ఉంది. ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలను తీసుకరావల్సి ఉంది.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు వచ్చేలా చర్యలు తీసు కుంటాను. జాతీయ రహదారితో పాటు దుందుబి నదిలో రఘుపతిపేట దగ్గర వంతెన ఏర్పాటుకు కృషి చేస్తాను. టీఆర్ఎస్ సొంత ఇండ్లు లాంటిది. ప్రతి ఒక్కరి వచ్చేలా చేస్తా.