Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరాటే క్లబ్ విద్యార్థులు ఎంపిక
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర వేదికగా నవంబర్ 13 న హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహి స్తున్నటువంటి 2వ అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు జిల్లా కేంద్రా నికి చెందిన కింగ్ షోటో కాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ఎంపికైనట్టు ఫౌండర్ , సీనియర్ మాస్టర్ జహంగీర్ పాష ఖాద్రి తెలిపారు. గురువారం ఎంపికైన కరటి విద్యార్థులను జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్ హైస్కూల్లో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ ,నేపాల్ ,ఉగాండా, ఇరాన్, ఇరాక్ ,కిజికిస్తాన్ ల నుండి దాదాపుగా 2000 మందికి పైగా క్రీడాకారులు హజరౌతున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లా వాలీబాల్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య, లక్ష్మణ్ మాట్లాడుతూ అంతర్జాతీయ కరాటే పోటీల్లో కింగ్ షోటోకాన్ విద్యార్థులు ప్రతిభా చాటి పతకాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ నూతన కమిటీ ఎన్నిక.....
కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ నూతన కమిటీ ఎన్నుకున్నట్లు క్లబ్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ తెలిపారు. క్లబ్ చీఫ్ ప్యాట్రన్‌గా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్యాట్రన్‌గా సినీ హీరో సుమన్, చైర్మన్‌గా లక్ష్మణ్, వైస్ చైర్మన్‌గా చెన్న వీరయ్య, అధ్యక్షుడిగా అబ్దుల్ రెహమాన్, ప్రధాన కార్యదర్శిగా బాలు మహేందర్‌నాయక్,కార్యనిర్వాహకఅధ్యక్షులుగా రఫిక్ పటేల్, ఉపాధ్యక్షులుగా ఎంఏ జకీ, సంయుక్త కార్యదర్శిగా శశికాంత్, కోశాధికారిగా తిరుపతయ్యలు ఎన్నికైనట్లు తెలిపారు. నూతన కమిటీ సన్మానోత్సవ సభను త్వరలో నిర్వహిస్తామని తెలిపారు.