Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజాపూర్ : జీపీ కార్మికు లకు పెండింగ్ వేతనాలివ్వాలని సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షులు దీప్లా నాయక్ అన్నారు. రాజాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఏదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీపీ కార్మికులకు ప్రభుత్వం అమలు చేసిన 8500 రూపా యలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెలకు రూ. 5వేలిస్తూ ఇస్తూ పాలకవర్గం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. 5 వేల రూపాయలతో కుటుంబాన్ని గడుపు కోవడం చాలా కష్టంగా మరిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు అమలు చేయకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, సత్యమ్మ, పద్మ, ఇస్తారమ్మ, వెంకటమ్మ, లక్ష్మమ్మ, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.