Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదాన ంలో జలజం సత్య నారాయణ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్న మెంట్ను ఉత్సాహంగా కొనసా గుతుంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల క్రికెట్ టీములు సత్తా చాటుతున్నారు. గురువారం గెలుపొందిన టీములకు ఎంపీసీఏ జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మెమొంటోలను బహుమతులను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్లో ఓడిన వారు నిరాశ పడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా పీటీలు కిరణ్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.