Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నచింతకుంట : ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్న తులు వెంటనే చేపట్టాలని యూట ీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి పాపన్న గారి మాణిక్ రెడ్డి చిన్నచింతకుంట మండలంలోని సీసీ కుంట, బండర్వల్లి, లాల్ కోట,వడ్డేమాన్, సీసీ కుంట తదితర పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల పదోన్నతులు,బదిలీలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం కషి చేయాలని డిమాండ్ చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేయాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నదని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం, ఉపాధ్యాయ హక్కుల సాధన కోసం, ఉపాధ్యాయుల గొంతుకగా పనిచేస్తానని పెర్కొన్నారు.ఉపాధ్యాయుల యొక్క అన్ని రకాల సమస్యల పరిష్కారంలో టీఎస్ యూటీఎఫ్ ముందున్నదని, మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కె రవికుమార్ ,జిల్లా ఉపాధ్యక్షులు పి ఉమాదేవి, మండల అధ్యక్షులు జయంతి,మండల ప్రధాన కార్యదర్శి గోపాల్,మండల నాయకులు రవీంద్రప్ప,అరుణ, రాఘవేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.