Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధరూర్
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ప్రకటించే విధంగా చట్టం చేయాలని ఏఐకేఎస్ అఖిలభారత ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. గురువారం రైతు సంఘం జిల్లా రెండోమహాసభలు టీఎన్జీవోహాలు కృష్ణవేణి చౌక్‌లో జీకే ఈదన్న అధ్యక్షతన వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించే విధంగా చట్టం చేయాలని అన్నారు. రైతులు దేశవ్యాప్తంగా మూడు వ్యవసా య చట్టాలు విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని 13నెలలపాటు పోరాటం సాగించిన సందర్భంగా కేంద్రప్రభుత్వం రైతు పోరాటా లకు దిగివచ్చి మూడు చట్టాలను వెనక్కితీసుకొని పంటలకు మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. ఇప్పటికీ సంవత్సరం గడువుపూర్తయిన నేటికీ హామీలు నేరవేర్చలేదన్నారు. రైతులు పండిం చిన పంటలను ధళా రులు తక్కువరేటు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ప్రకటించే చట్టం ప్రకటించాలని కోరారు. కార్యక్ర మంలో రైతుసంఘం రాష్ట్ర నాయకులు బాలురెడ్డి, మద్దిలేటి ఈదన్న, మల్లేష్, జిల్లా కార్యదర్శి రేపల్లె దేవదాసు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటస్వామి, నరసింహ, బుచ్చన్న, మల్లేష్, భీమారాయుడు, నరేష్, రంజిత్ పాల్గొన్నారు.